(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా మార్చి 15 నుంచి ప్రారంభమైన ఒంటిపూట బడుల సమయాలపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ఉదయం 7.45 గంటలకు మొదటి గంట కొట్టాలని, 7.50 గంటలకు స్కూల్ అసెంబ్లీ జరపాలని పేర్కొంది.
(2 / 6)
ఒంటిపూట బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయని ఇటీవల తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటలకు మొదటి గంట, 8.15 గంటల నుంచి తరగతులు అని ప్రచారం జరిగింది. దీనిపై విద్యాశాఖ స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
(3 / 6)
తెలంగాణ పదో తరగతి పరీక్షలు జరుగుతున్న స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం 1.00 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.
(4 / 6)
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు స్కూళ్లకు ఒంటిపూట బడులు ప్రారంభించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23కు తెలంగాణ, ఏప్రిల్ 24 వరకు ఏపీలో ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.
(5 / 6)
ఏపీలో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఆ తరువాత జూన్ 12 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్లలో మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.
ఇతర గ్యాలరీలు