TG EAPCET 2025 : తెలంగాణ ఈఏపీసెట్ పై అప్డేట్, మార్చి 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ
TG EAPCET 2025 : ఈ రోజు సాయంత్రం నుంచి ప్రారంభం కావాల్సిన తెలంగాణ ఈఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. బీటెక్, బీఫార్మసీతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ దరఖాస్తులను మార్చి 1 నుంచి స్వీకరించనున్నారు.
(1 / 6)
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అప్డేట్. నేటి సాయంత్రం నుంచి ప్రారంభం కావాల్సిన ఈఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. బీటెక్, బీఫార్మసీతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్(TG EAPCET 2025) దరఖాస్తులను మార్చి 1 నుంచి స్వీకరిస్తామని కన్వీనర్ డీన్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
(2 / 6)
ఇటీవల ప్రకటించిన ఈఏపీసెట్ షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం 4.45 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉండగా.. తాజాగా ఇది మార్చి 1కి వాయిదా పడింది. శనివారం నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు ఈఏపీసెట్ వెబ్ సైట్ లో సమాచారం ఇచ్చారు.
(3 / 6)
తెలంగాణ ఈఏపీసెట్ నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. మార్చి 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ఎంట్రెన్స్ కోసం నిర్వహించే ఈఏపీసెట్ ను నిర్వహిస్తారు.
(4 / 6)
ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోసం ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. మే 2 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉన్నత విద్యామండలి తరపున హైదరాబాద్ జేఎన్‌టీయూనే ఈఏపీసెట్ ఎగ్జామ్స్ నిర్వహించనుంది.
(5 / 6)
షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తును ఎడిట్ చేసుకోవచ్చు. ఇక ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు