తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - రేపు 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల...!-telangana dost notification 2025 will be released on may 2 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - రేపు 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల...!

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - రేపు 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల...!

Published May 01, 2025 09:27 PM IST Maheshwaram Mahendra Chary
Published May 01, 2025 09:27 PM IST

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ప్రకటన వెలువడనుంది. ఇందులో భాగంగా శుక్రవారం (మే 2) ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీని ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు.

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ‘దోస్త్’ ప్రకటన విడుదలకు రంగం సిద్ధమైంది.  మే 2వ తేదీన ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది.

(1 / 6)

(istock,com)

రేపు(మే 2) మధ్యాహ్నం తర్వాత ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇంటర్ మార్కులతో పాటు విద్యార్థులు ఎంచుకునే ఆప్షన్ల ఆధారంగా డిగ్రీ ప్రవేశాలు కల్పిస్తారు.

(2 / 6)

(pixabay)

ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం కోసం దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీలను ఎంచుకోవాలి. వారి స్కోర్, రిజర్వేషన్ ఆధారంగా…. సీట్లను కేటాయిస్తారు. విడతల వారీగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

(3 / 6)

దోస్త్ రిజిస్ట్రేషన్ల ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, పాలమూరు, మహాత్మగాంధీ, తెలంగాణ వర్శిటీ,చాకలి ఐలమ్మ, శాతవాహన వర్శిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను కల్పిస్తారు.

(4 / 6)

గతేడాది డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను 3 విడతల్లో పూర్తి చేశారు. మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం స్పెషల్ ఫేజ్ అవకాశం కూడా కల్పించారు. ఈసారి కూడా మొత్తం 3 విడతల్లో సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది.

(5 / 6)

(HT Telugu )

దోస్త్‌ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల అప్డేట్స్ తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ల ఫీజుతో పాటు వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు, అలాట్ మెంట్ కాపీలు పొందటం వంటి ప్రక్రియలను పూర్తి చేసుకోవచ్చు.

(6 / 6)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు