తెలుగు న్యూస్ / ఫోటో /
Telangana Cabinet : ఈనెల 4న తెలంగాణ కేబినెట్ భేటీ - రైతు భరోసా, రేషన్ కార్డులపై కీలక నిర్ణయాలకు అవకాశం..!
- Telangana Cabinet Meeting : ఈనెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో… కీలక అంశాలపై చర్చించనున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లతో పాటు మరిన్ని అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
- Telangana Cabinet Meeting : ఈనెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో… కీలక అంశాలపై చర్చించనున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లతో పాటు మరిన్ని అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
(1 / 6)
జనవరి 4వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం కానుంది, సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
(2 / 6)
కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికలపై పూర్తిస్థాయిలో సమాలోచనలు చేయనుంది. పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 15 వేలు జమ చేసేందుకు వీలుగా మార్గదర్శకాలను ప్రకటించే అవకాశం ఉంది.
(3 / 6)
సంక్రాంతి తర్వాత రైతు భరోసాను చెల్లిస్తామని రేవంత్ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పంట సాగు చేస్తేనే పెట్టుబడి సాయం అందించాలని సర్కార్ యోచిస్తోంది. అంతేకాదు.. రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా శాటిలైట్ సేవల ద్వారా సాగు వివరాలను తెలుసుకునేలా కసరత్తు చేస్తోంది. పంటపెట్టుబడి సాయానికి సీలింగ్ విధించాలా వద్దా..? అనే దానిపై కూడా ఈ భేటీతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
(4 / 6)
ఇక రాష్ట్రంలో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా నివేదికను సమర్పించింది. అయితే దరఖాస్తుల స్వీకరణ, ఆదాయ పరిమితులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ తేదీపై కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
(5 / 6)
జనవరి 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో…. బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలపై కూడా చర్చ జరగనుంది. అంతేకాకుండా… టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయానికి కూడా బోర్డును ఏర్పాటు చేయటంపై నిర్ణయం తీసుకోనుంది. ఇందిరమ్మ ఇళ్ల సర్వే, టూరిజం పాలసీతో పాటు మరికొన్ని అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది.
ఇతర గ్యాలరీలు