AP TG Weather Updates : ద్రోణి ఎఫెక్ట్...! 3 రోజుల పాటు వర్షాలు, హైదరాబాద్ లో ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్..!
- AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలో మరికొద్దిరోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. మంగళవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా… మరో మూడు నాలుగు రోజుల పాటు కూడా వానలు పడే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ పూర్తి కథనంలో చూడండి….
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. మరో నాలుగైదు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
(2 / 6)
ఇక ఇవాళ(ఆగస్టు 17) ఏపీలో చూస్తే శ్రీకాకుళం,విజయనగరం,పార్వతీపురంమన్యం, అల్లూరి , విశాఖపట్నం,అనకాపల్లి,కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి, ఏలూరు,అనంతపురం,శ్రీ సత్యసాయి,వైయస్ఆర్, అన్నమయ్య,చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(3 / 6)
•పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
(4 / 6)
ద్రోణి ప్రస్తుతం రాయలసీమ నుంచి కొమెురిన్ ప్రాంతం వరకు విస్తరించి సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని మంగళవారం విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది.
(5 / 6)
ఇవాళ హైదరాబాద్ లో వాతారణం చూస్తే నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య లేదా పశ్చిమ దిశలో గంటకు 06 -10 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు