(1 / 7)
వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఏపీ తెలంగాణలో మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
(image source from @APSDMA twitter)(2 / 7)
ఏపీలో ఇవాళ(జులై 13) మన్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు,గుంటూరు, బాపట్ల,పల్నాడు,ప్రకాశం,నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(image source from @APSDMA twitter)(3 / 7)
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
(image source from @APSDMA twitter)(4 / 7)
ఆది,సోమవారాల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
(image source from @APSDMA twitter)(5 / 7)
ఇక తెలంగాణలో చూస్తే శుక్రవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
(image source from @APSDMA twitter)(6 / 7)
ఇవాళ(జులై 13) తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్ధిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేసింది.
(image source from @APSDMA twitter)ఇతర గ్యాలరీలు