AP TG Weather Updates : ఆవర్తనం, ద్రోణి ఎఫెక్ట్ - 4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
- AP Telangana Rains : ద్రోణి, ఉపరిత ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు నాలుగు రోజల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆగస్టు 21వ తేదీ వరకు వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Rains : ద్రోణి, ఉపరిత ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు నాలుగు రోజల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆగస్టు 21వ తేదీ వరకు వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
(1 / 7)
వాయువ్య బంగాళాఖాతం మీదుగా బంగ్లాదేశ్ కు అనుకొని ఉన్న ప్రాంతాల మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరిత అవర్తనం విస్తరించి ఉందని తెలిపింది. కొంకణ్ నుంచి ఆగ్నేయ ఆరేబియా సముద్రం ఉన్న ద్రోణి ఉందని తెలిపింది. దక్షిణ, ఉత్తర అంతర్భాగ కర్నాటక పొరుగు ప్రాంతాల మీద ఉనఅన ఉపరిత ఆవర్తనం మీదుగా వ్యాపించి.... సముద్ర మట్టానికి 1. 5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వెల్లడించింది.
(2 / 7)
ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
(3 / 7)
ఇవాళ( ఆగస్టు 17)వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(4 / 7)
రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 21వ తేదీ వరకు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
(5 / 7)
(6 / 7)
శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి,బాపట్ల, ప్రకాశం,నెల్లూరు,వైయస్ఆర్,అన్నమయ్య,చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
(7 / 7)
ఇక హైదరాబాద్ నగరంలో శుక్రవారం వర్షం మరోసారి దంచికొట్టింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్, నిజాంపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, పటాన్ చెరు, రామచంద్రపురం, అమీన్ పూర్, ఖైరతాబాద్, చందానగర్, మియాపూర్, సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.భారీ వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
(ANI)ఇతర గ్యాలరీలు