Weather Report : ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్ - ఈ 3 రోజులపాటు అతి భారీ వర్షాలు..!
- AP Telangana Weather Updates : అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఏపీలోని కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై ఐఎండీ అప్డేట్ ఇచ్చింది. పశ్చిమవాయువ్య దిశగా ఉత్తరాంధ్ర,దక్షిణఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది.
(2 / 6)
ఇవాళ ఏపీలో (ఆగస్టు 31) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
(3 / 6)
ఇవాళ అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని… ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
(4 / 6)
కోస్తా తీరం వెంబడి బలమైన వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించింది.
(5 / 6)
తెలంగాణలో చూస్తే 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ(ఆగస్టు 31) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడకక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక నిర్మల్, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇతర గ్యాలరీలు