TG SSC Exam Results 2025 : తెలంగాణ పదో తరగతి పరీక్షల అప్డేట్స్ - ఏప్రిల్ 7 నుంచి స్పాట్ వాల్యుయేషన్, ఇవిగో వివరాలు
- TG SSC Exams Paper Evaluation 2025: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరగుతున్నాయి. ఇదిలా ఉండగానే… స్పాట్ వాల్యూయేషన్ కు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. పరీక్షలు పూర్తైన వెంటనే వాల్యూయేషన్ చేయనున్నారు. ఏప్రిల్ 4 నుంచి 15 తేదీల మధ్య పూర్తి చేసేలా కార్యాచరణను సిద్ధం చేశారు. అప్డేట్స్ ఇక్కడ చూడండి
- TG SSC Exams Paper Evaluation 2025: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరగుతున్నాయి. ఇదిలా ఉండగానే… స్పాట్ వాల్యూయేషన్ కు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. పరీక్షలు పూర్తైన వెంటనే వాల్యూయేషన్ చేయనున్నారు. ఏప్రిల్ 4 నుంచి 15 తేదీల మధ్య పూర్తి చేసేలా కార్యాచరణను సిద్ధం చేశారు. అప్డేట్స్ ఇక్కడ చూడండి
(1 / 6)
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 4తో అన్ని ఎగ్జామ్స్ పూర్తవుతాయి. అయితే ఆ వెంటనే జవాబుపత్రాల మూల్యాంకనం చేసేలా అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు.
(2 / 6)
పరీక్షలు పూర్తయిన వెంటనే స్పాట్ వాల్యుయేషన్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయనున్నారు.
(3 / 6)
ఏప్రిల్ 4వ తేదీన పరీక్షలు పూర్తి కాగానే… ఆ వెంటనే స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలకు పేపర్స్ తరలిస్తారు. ఇందుకోసం ఇప్పటికే సిబ్బందిని కూడా విద్యాశాఖ నియమించింది. స్పాట్ లోనే పాల్గొనే వారి వివరాలను కూడా సిద్ధం చేసింది.
(4 / 6)
ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ జరగుతుంది. ఇందుకోసం మొత్తం 19 చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు. పకడ్బందీగా స్పాట్ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
(5 / 6)
స్పాట్ పూర్తైన వెంటనే మార్కులను ఎంట్రీ చేస్తారు. ఒకటికి రెండు సార్లు పరిశీలించి… తుది ఫలితాల ప్రకటనకు సిద్ధం చేస్తారు. అయితే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే… ఫలితాల తేదీని ప్రకటిస్తారు. https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లో ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
(6 / 6)
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 11,547 పాఠశాలల నుంచి మొత్తం 5,09,403 మంది (బాలురు: 2,58,895, బాలికలు: 2,50,508) విద్యార్థులు నమోదు చేసుకున్నారు. మొత్తం 2650 పరీక్షా కేంద్రాలకు 2650 చీఫ్ సూపరింటెండెంట్లు, 2650 డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 28,100 ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. లీకేజీ వంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
ఇతర గ్యాలరీలు