Tecno Spark Go 2023: బడ్జెట్ రేంజ్‍లో మొబైల్ కావాలనుకునే వారికి మరో ఆప్షన్..
ఎంట్రీ లెవెల్‍లో టెక్నో స్పార్క్ గో 2023 భారత మార్కెట్‍లోకి అడుగుపెట్టింది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. వెనుక రెండు కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్‍కు సంబంధించిన వివరాలను ఫొటోలతో పాటు ఇక్కడ చూడండి.
(1 / 7)
ఎండ్‍లెస్ బ్లాక్, ఉయుని బ్లూ, నెబ్యులా పర్పుల్ కలర్ ఆప్షన్‍లలో టెక్నో స్పార్క్ గో 2023 లభిస్తోంది.
(2 / 7)
1612x720 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండే 6.56 ఇంచుల హెచ్‍డీ+ టాచ్ నాచ్ ఐపీఎస్ డిస్‍ప్లేతో టెక్నో స్పార్క్ గో 2023 ఫోన్ వస్తోంది.
(3 / 7)
మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ ఈ ఫోన్‍లో ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత HiOS 12.0 ఆపరేటింగ్ సిస్టమ్‍పై రన్ అవుతుంది.
(4 / 7)
ఈ టెక్నో ఎంట్రీ లెవెల్ మొబైల్ వెనుక 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు సెకండరీ ఏఐ కెమెరా ఉంటుంది.
(6 / 7)
5000mAh బ్యాటరీతో Tecno Spark Go 2023 ఫోన్ వస్తోంది. 10 వాట్ల చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. చార్జింగ్ కోసం టైప్-సీ పోర్ట్ ఈ మొబైల్‍కు ఉంది.
ఇతర గ్యాలరీలు