Team India: ఓవైపు ఆనందం.. మరోవైపు నిర్వేదం.. ఫైనల్ తర్వాత భావోద్వేగ క్షణాలు.. ఫొటోల్లో..
- Team India: వరల్డ్ కప్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఓవైపు ఆనందం, మరోవైపు నిర్వేదం కనిపించాయి. ఆస్ట్రేలియా ప్లేయర్స్ సంబరాలు చేసుకోగా.. ఇండియన్ ప్లేయర్స్ ఎంతో భావోద్వేగంతో కనిపించారు.
- Team India: వరల్డ్ కప్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఓవైపు ఆనందం, మరోవైపు నిర్వేదం కనిపించాయి. ఆస్ట్రేలియా ప్లేయర్స్ సంబరాలు చేసుకోగా.. ఇండియన్ ప్లేయర్స్ ఎంతో భావోద్వేగంతో కనిపించారు.
(1 / 13)
Team India: ఆస్ట్రేలియా చేతుల్లో ఫైనల్ ఓడిన తర్వాత బాధలో ఉన్న విరాట్ కోహ్లిని ఓదారుస్తున్న భార్య అనుష్క శర్మ.(AFP)
(2 / 13)
Team India: ఆరోసారి విశ్వవిజేతగా నిలిచిన తర్వాత ట్రోఫీతో ఆస్ట్రేలియా ప్లేయర్స్ సంబరాలు.(PTI)
(3 / 13)
Team India: వరల్డ్ కప్ 2023లో 765 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచి మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచినా కూడా ట్రోఫీ గెలవలేకపోయామన్న బాధలో విరాట్ కోహ్లి(PTI)
(4 / 13)
Team India: ఫైనల్లో అద్భుతమైన వ్యూహాలతో టీమిండియాను ముప్పుతిప్పలు పెట్టిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. ట్రోఫీతో ఇలా ఫొటోలకు పోజులిచ్చాడు.(PTI)
(5 / 13)
Team India: వరల్డ్ కప్ 2023 ఫైనల్ వరకూ వరుసగా పది విజయాలతో టీమిండియాను ముందుండి నడిపించిన నాయకుడు రోహిత్ శర్మ.. ఫైనల్లో ఓటమి తర్వాత ఇలా ఎంతో నిరాశగా కనిపించాడు.(PTI)
(6 / 13)
Team India: వరల్డ్ కప్ 2023 ఫైనల్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ తో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.(PTI)
(7 / 13)
Team India: ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు అందుకున్న తర్వాత విరాట్ కోహ్లి ఇలా కనిపించాడు. అతని ముఖంలో కప్పు గెలవలేకపోయామన్న బాధ స్పష్టంగా కనిపిస్తోంది.(PTI)
(8 / 13)
Team India: ఇండియాను ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా చూడాలని ఎంతో ఆశగా వచ్చిన లక్ష మందికిపైగా అభిమానుల పరిస్థితి ఇదీ. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు కూడా ఇలాగే ఫీలయ్యారు.(AFP)
(9 / 13)
Team India: భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని నుంచి వరల్డ్ కప్ ట్రోఫీ అందుకున్న తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(PTI)
(10 / 13)
Team India: ఓవైపు ఆస్ట్రేలియా గెలుపు సంబరాలు.. మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశ. ఇదొక్క ఫొటో వరల్డ్ కప్ ఫైనల్ ఎలా ముగిసిందో కళ్లకు కడుతోంది.(PTI)
(11 / 13)
Team India: లక్షకుపైగా భారత అభిమానులతో నీలి సముద్రంగా మారిన నరేంద్ర మోదీ స్టేడియంలో కొంత మంది ఆస్ట్రేలియా ప్లేయర్స్ కూడా ఉన్నారు. వాళ్లతో కప్పు గెలిచిన తర్వాత కెప్టెన్ కమిన్స్ సెల్పీ దిగాడు.(REUTERS)
(12 / 13)
Team India: ఇండియాను ఫైనల్లో ఓడించిన తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్స్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్నస్ లబుషేన్ సంబరాలు. (AP)
ఇతర గ్యాలరీలు