గంభీర్ తల్లికి గుండెపోటు.. ఇండియాకు తిరిగి వచ్చేసిన హెడ్ కోచ్.. తిరిగి ఇంగ్లండ్‌కు ఎప్పుడు వెళ్తాడంటే?-team india head coach gautham gambhir returns to india after his mother gets heart attack ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  గంభీర్ తల్లికి గుండెపోటు.. ఇండియాకు తిరిగి వచ్చేసిన హెడ్ కోచ్.. తిరిగి ఇంగ్లండ్‌కు ఎప్పుడు వెళ్తాడంటే?

గంభీర్ తల్లికి గుండెపోటు.. ఇండియాకు తిరిగి వచ్చేసిన హెడ్ కోచ్.. తిరిగి ఇంగ్లండ్‌కు ఎప్పుడు వెళ్తాడంటే?

Published Jun 13, 2025 03:59 PM IST Hari Prasad S
Published Jun 13, 2025 03:59 PM IST

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తిరిగి స్వదేశానికి వచ్చాడు. అతని తల్లికి గుండెపోటు రావడంతో ఆమెను హాస్పిటల్లో చేర్చారు. దీంతో మిగిలిన టీమ్ ఇంగ్లండ్ లోనే ఉండిపోగా.. గంభీర్ తిరిగి వచ్చాడు.

గౌతమ్ గంభీర్ కుటుంబ కారణాల రీత్యా ఇంగ్లాండ్ నుంచి భారత్ కు తిరిగి వస్తున్నాడు. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. తొలి టెస్టుకు ముందు టీమిండియా ప్రధాన కోచ్ భారత జట్టులో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. జూన్ 20 నుంచి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తలపడనుంది.

(1 / 5)

స్పోర్ట్స్ స్టార్ కథనం ప్రకారం గంభీర్ శుక్రవారం (జూన్ 13) లండన్ నుంచి ఇండియాకు బయలుదేరాడు. గంభీర్ తల్లికి గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలిసిన వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్లాలని భారత జట్టు ప్రధాన కోచ్ నిర్ణయించుకున్నాడు. బోర్డు అతనికి అండగా నిలిచింది.

(2 / 5)

గంభీర్ గైర్హాజరీలో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ భారత జట్టు బాధ్యతలు చూస్తున్నారు. గంభీర్ జట్టులో చేరనంత కాలం టీమిండియా ఆటగాళ్లు వారి కిందే ఉంటారు. వారు ఆడే ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత జట్టుకు కోచింగ్ ఇచ్చే బాధ్యత డస్కాటే చేతిలో ఉంటుంది.

(3 / 5)

శుక్రవారం (జూన్ 13) నుంచి టీమిండియా సీనియర్ జట్టుతో భారత 'ఎ' జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. భారత్ 'ఎ' జట్టు ఇప్పటికే రెండు అనధికారిక టెస్టులు ఆడింది. అయితే, తొలి టెస్టులో ఆడే వారిలో ఇద్దరు లేదా ముగ్గురు ఆ అనధికారిక టెస్టులో ఆడినవారే. దీంతో అందరి దృష్టి ఈ ప్రాక్టీస్ మ్యాచ్ పైనే ఉంది. జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు భారత ఆటగాళ్లు ఇక్కడ చివరి మ్యాచ్ ప్రాక్టీస్ చేసే అవకాశం లభిస్తుంది.

(4 / 5)

ఇంగ్లాండ్ సిరీస్ తో ఇండియా తన నాలుగో వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్ వేట ప్రారంభించనుంది. ప్రస్తుతం లార్డ్స్ వేదికగా మూడో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతోంది. ఒక దశలో ఆ మ్యాచ్ రేసులో ఉన్న భారత్ వరుసగా రెండు సిరీస్ లు కోల్పోయి ఆ అవకాశాన్ని కోల్పోయింది.

(5 / 5)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు