(1 / 5)
ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో ఇప్పటి వరకూ కేవలం నలుగురు టీమిండియా కెప్టెన్లు మాత్రమే సెంచరీలు చేశారు. మరి ఇప్పుడు 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్ కూడా ఆ ఘనతను అందుకుంటాడా? ఆ అరుదైన క్లబ్ లో చేరతాడా అన్నది చూడాలి.
(PTI)(2 / 5)
మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ - ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్ ఇతడే. 1967లో లీడ్స్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 148 పరుగులు చేశాడు.
(ICC)(3 / 5)
మహ్మద్ అజారుద్దీన్ - పటౌడీ తర్వాత 23 ఏళ్ల పాటు ఇంగ్లండ్ లో ఏ భారత కెప్టెన్ సెంచరీ చేయలేదు. తర్వాత మహమ్మద్ అజారుద్దీన్ 1990లో ఇంగ్లండ్ పర్యటనలో రెండు సెంచరీలు సాధించాడు. లార్డ్స్ లో 121, మాంచెస్టర్లో 179 పరుగులు చేశాడు.
(X)(4 / 5)
సౌరవ్ గంగూలీ - ఈ జాబితాలో మూడో పేరు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. గంగూలీ 2002లో ఇంగ్లండ్ గడ్డపై 128 పరుగులు చేశాడు. లీడ్స్ మైదానంలో అతను ఈ అద్భుతం చేశాడు.
(X)(5 / 5)
విరాట్ కోహ్లీ - ఇంగ్లండ్ లో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు సాధించాడు. 2018లో ఇంగ్లండ్ పర్యటనలో బర్మింగ్హామ్ లో 149, నాటింగ్హామ్ లో 103 పరుగులు చేశాడు.
(AP)ఇతర గ్యాలరీలు