ఇంగ్లండ్ గడ్డపై టెస్టు గెలిచిన టీమిండియా కెప్టెన్లు వీళ్లే.. ఆరుగురికే ఆ ఘనత.. శుభ్‌మన్ గిల్ సాధిస్తాడా?-team india captains with a test match win in england can subhman gill repeat the same ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఇంగ్లండ్ గడ్డపై టెస్టు గెలిచిన టీమిండియా కెప్టెన్లు వీళ్లే.. ఆరుగురికే ఆ ఘనత.. శుభ్‌మన్ గిల్ సాధిస్తాడా?

ఇంగ్లండ్ గడ్డపై టెస్టు గెలిచిన టీమిండియా కెప్టెన్లు వీళ్లే.. ఆరుగురికే ఆ ఘనత.. శుభ్‌మన్ గిల్ సాధిస్తాడా?

Published Jun 17, 2025 04:36 PM IST Hari Prasad S
Published Jun 17, 2025 04:36 PM IST

భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జూన్ 20 నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈసారి శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతోంది. అయితే ఇంతకుముందు ఇంగ్లండ్ వెళ్లిన సందర్భాల్లో కేవలం 9 టెస్టుల్లోనే టీమిండియా గెలిచింది. ఆరుగురు కెప్టెన్లకే ఈ ఘనత దక్కింది.

అజిత్ వాడేకర్ - ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి టెస్ట్ మ్యాచ్ గెలిచిన భారత కెప్టెన్ అజిత్ వాడేకర్. 1971లో వాడేకర్ సారథ్యంలో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను ఓడించింది. ఆ తర్వాత భారత జట్టు మూడు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లగా అందులో రెండు డ్రా అయ్యాయి.

(1 / 6)

(BCCI)

కపిల్ దేవ్ - ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ 1986లో ఇంగ్లండ్ లో రెండు సార్లు విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించగా, రెండో మ్యాచ్ లో 279 పరుగుల తేడాతో గెలిచింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో చివరి టెస్టు డ్రాగా ముగిసింది.

(2 / 6)

(ICC)

సౌరవ్ గంగూలీ సారథ్యంలోని టీమిండియా 2002లో ఇంగ్లండ్ ను ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఓడించింది. అయితే నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ డ్రాగా ముగిసింది.

(3 / 6)

(X)

రాహుల్ ద్రవిడ్ - 2007లో రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో భారత్ ఇంగ్లండ్ లో విజయాన్ని రుచి చూసింది. నాటింగ్హామ్ లో ఆతిథ్య జట్టుపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.

(4 / 6)

ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 2014లో ఇంగ్లండ్ పై భారత్ 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ధోనీ సేన 1-3 తేడాతో పరాజయం పాలైంది.

(5 / 6)

విరాట్ కోహ్లీ - ఇంగ్లండ్ లో అత్యధిక టెస్ట్ మ్యాచ్ లు గెలిచిన భారత కెప్టెన్ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట నమోదైంది. కోహ్లీ నాయకత్వంలో భారత్ ఇంగ్లండ్ గడ్డపై మూడు టెస్టులు గెలిచింది. 2018లో భారత్ 203 పరుగుల తేడాతో, 2021లో 151, 157 పరుగుల తేడాతో విజయాలు సాధించింది. శుక్రవారం నుంచి ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భారత్ తలపడనుంది. కొత్త టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రాబోయే సిరీస్ లో విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టగలడా లేదా అన్నది చూడాలి.

(6 / 6)

(HT)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు