తెలుగు న్యూస్ / ఫోటో /
Team India Practice: టీమిండియా ప్రాక్టీస్ షురూ.. టీ20 వరల్డ్ కప్ కొత్త ట్రైనింగ్ కిట్ చూశారా?
- Team India Practice: టీమిండియా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2024 కోసం న్యూయార్క్ వెళ్లిన ఇండియన్ టీమ్.. కొత్త ట్రైనింగ్ కిట్ లో కనిపించింది.
- Team India Practice: టీమిండియా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2024 కోసం న్యూయార్క్ వెళ్లిన ఇండియన్ టీమ్.. కొత్త ట్రైనింగ్ కిట్ లో కనిపించింది.
(1 / 6)
Team India Practice: టీ20 వరల్డ్ కప్ 2024 భారత కాలమానం ప్రకారం జూన్ 2న ప్రారంభం కానుంది. జూన్ 29తో ముగుస్తుంది. దీనికోసం ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్న ఇండియన్ ప్లేయర్స్ ప్రాక్టీస్ షురూ చేశారు.
(2 / 6)
Team India Practice: టీమిండియా ప్లేయర్స్ సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ ఇలా ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించారు. 2007 తర్వాత మళ్లీ టీ20 వరల్డ్ కప్ గెలవని ఇండియన్ టీమ్.. ఈసారైనా దానికి తెరదించాలని చూస్తోంది.
(3 / 6)
Team India Practice: టీమిండియా ప్లేయర్స్ రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఇలా సెల్ఫీలకు పోజులిచ్చారు. కొత్త ట్రైనింగ్ కిట్ లో టీమ్ ప్రాక్టీస్ చేస్తోంది. ప్రధాన టోర్నీ ప్రారంభానికి ముందు జూన్ 1న బంగ్లాదేశ్ తో ఇండియన్ టీమ్ వామప్ మ్యాచ్ ఆడనుంది.
(4 / 6)
Team India Practice: స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు అతడే కీలకం కానున్నాడు.
(5 / 6)
Team India Practice: టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇలా ఫీల్డ్ బయట సెల్ఫీ తీసుకున్నాడు. వరల్డ్ కప్ లో అతడు ఓపెనింగ్ చేస్తాడా లేక కోహ్లిది అయిన మూడో స్థానంలో వస్తాడా అన్నది చూడాలి.
ఇతర గ్యాలరీలు