Tata Curvv : టాటా కర్వ్ లాంచ్.. ధర, ఫీచర్లతోపాటు ఈ కారు ఫోటోలు చూసేయండి
Tata Curvv ICE Launched : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాటా కర్వ్ ఐసీఈ లాంచ్ అయింది. ఈ కారు ప్రారంభ దర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
(1 / 6)
టాటా కర్వ్ ఐసీఈ భారత మార్కెట్లోకి అధికారికంగా లాంచ్ అయింది. ఆగస్టులో కర్వ్ ఆల్-ఎలక్ట్రిక్ మోడల్‌ను విడుదల చేసిన ఒక కార్యక్రమంలో దీనిని ప్రదర్శించారు. పెట్రోల్, డిజీల్‌తో నడిచే ఇంజిన్ ఆధారిత వెర్షన్‌ను ఇప్పుడు అధికారికంగా లాంచ్ చేశారు. ఇది ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి వాటికి పోటీ ఇవ్వనుంది.
(2 / 6)
టాటా మోటార్స్ నుండి వచ్చిన కర్వ్ ఐసీఈ వెర్షన్ మూడు ఇంజన్లతో పనిచేస్తుంది. 1.2-లీటర్ టర్బో పెట్రోల్, సరికొత్త 1.2-లీటర్ జీడీఐ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ మోటార్. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్‌లతో వస్తుంది.
(3 / 6)
కర్వ్ ఐసీఈ స్టైలింగ్ చూసుకుంటే కర్వ్ ఈవీని పోలి ఉంటుంది. రెండు మోడళ్లు ప్రధానంగా వాటి స్లోపింగ్ రూఫ్‌లైన్ చాలా బాగుంటాయి. అయితే టాటా కర్వ్ ఐసీఈ ఎయిర్ డ్యామ్‌లను విభిన్నంగా డిజైన్ చేయగా.. 18 అంగుళాల చక్రాలపై అల్లాయ్‌ల డిజైన్ కూడా భిన్నంగా ఉంటుంది.
(4 / 6)
12.3 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, తొమ్మిది స్పీకర్ల జేబీఎల్ సౌండ్ సిస్టమ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పనోరమిక్ సన్ రూఫ్ కూడా ఉంది.
(5 / 6)
ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వాహనం లోపల ఆడియో, విజువల్ ఎంటర్టైన్మెంట్ కోసం కమాండ్ సెంటర్. పవర్ టెయిల్‌గేట్, ఎలక్ట్రికల్ సర్దుబాటు చేసే డ్రైవర్ సీటు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఇంజిన్ స్టార్ట్, స్టాప్ బటన్స్‌తోపాటుగా అనేక ఫీచర్లు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు