(1 / 5)
తమిళ హీరో విశాల్ పెళ్లికి రెడీ అయ్యారు. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. అమ్మాయి కూడా దొరికిందని 47 ఏళ్ల విశాల్ తెలిపారు. అయితే, ఆయన ఎవరిని పెళ్లి చేసుకోనున్నారో సమాచారం చక్కర్లు కొడుతోంది.
(2 / 5)
తమిళ నటి సాయి ధన్సికను విశాల్ పెళ్లి చేసుకోనున్నారనే సమాచారం బయటికి వచ్చింది. ధన్సిక నటిస్తున్న యోగి దా మూవీ ఈవెంట్‍కు అతిథిగా విశాల్ నేడు వెళ్లనున్నారు. ఈ ఈవెంట్‍లోనే వీరి పెళ్లిపై మరింత క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.
(3 / 5)
సాయి ధన్సిక.. 2006లో మనతోడు మలైకాలం చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత మరిన్ని సినిమాల్లో నటించారు. కబాలీ, సోలో సినిమాలతో ధన్సిక పాపులర్ అయ్యారు. వరుసగా చిత్రాలు చేస్తున్నారు. కెరీర్లో ఎక్కువగా సపోర్టింగ్ పాత్రలే చేస్తున్నారు ధన్సిక. తెలుగులో షికారు అనే చిత్రంలోనూ నటించారు.
(4 / 5)
నడిగర్ సంఘం భవనం పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని విశాల్ గతంలో చెప్పారు. ఆ భవనం నిర్మాణం దాదాపు ఫినిష్ అవడంతో పెళ్లి ఎప్పుడు అంటూ ఇటీవల ఆయనకు ప్రశ్న ఎదురైంది. తాను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని, అమ్మాయి కూడా దొరికింది విశాల్ అన్నారు. ఆ అమ్మాయి 35 ఏళ్ల సాయి ధన్సికనే అనే రూమర్ బలంగా వినిపిస్తోంది. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
(5 / 5)
విశాల్, సాయి ధన్సిక కొన్ని నెలల క్రితమే పరిచమయ్యారని సమాచారం. పరస్పరం ఇష్టపడ్డారట. కాగా, విశాల్.. గతంలో వరలక్ష్మి శరత్ కుమార్‌తో ప్రేమలో ఉన్నారనే టాక్ చాలా కాలం నడిచింది. ఆనిషా అల్లతో విశాల్‍కు జరిగిన ఎంగేజ్‍మెంట్ రద్దయింది.
ఇతర గ్యాలరీలు