సూర్య, వెంకీ అట్లూరి సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన త్రివిక్రమ్.. హీరోయిన్‍గా ప్రేమలు బ్యూటీ: ఫొటోలు-suriya venky atluri mamitha baiju movie suriya46 launched grandly trivikram srinivas claps first ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  సూర్య, వెంకీ అట్లూరి సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన త్రివిక్రమ్.. హీరోయిన్‍గా ప్రేమలు బ్యూటీ: ఫొటోలు

సూర్య, వెంకీ అట్లూరి సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన త్రివిక్రమ్.. హీరోయిన్‍గా ప్రేమలు బ్యూటీ: ఫొటోలు

Published May 19, 2025 12:50 PM IST Chatakonda Krishna Prakash
Published May 19, 2025 12:50 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ సినిమా లాంచ్ అయింది. ఈ మూవీకి నేడు (మే 19) పూజా కార్యక్రమాలు జరిగాయి.

తమిళ స్టార్ హీరో సూర్య కొత్త సినిమా (Suriya46) లాంఛనంగా మొదలైంది. చాలా ఏళ్ల తర్వాత ఆయన స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై మంచి హైప్ నెలకొంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నేడు (మే 19) హైదరాబాద్‍లో జరిగాయి.

(1 / 5)

సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. గతేడాది లక్కీ భాస్కర్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు వెంకీ. ఇప్పుడు సూర్యతో మూవీకి ఛాన్స్ దక్కించుకున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన ప్రేమలు ఫేమ్ మమితా బైజూ హీరోయిన్‍గా నటించనున్నారు.

(2 / 5)

ఈ మూవీ పూజా కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అతిథిగా హాజరయ్యారు. ముహూర్తం షాట్‍కు ఫస్ట్ క్లాప్ కొట్టారు. సూర్య, మమితాపై ఫస్ట్ షాట్ చిత్రీకరణ లాంఛనంగా జరిగింది.

(3 / 5)

ఈ సూర్య46 ప్రాజెక్టును సితారా ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూజ్ చేయనుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పించనుంది. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా ఇది తెరకెక్కనుంది. రక్తచరిత్ర 2 (2010) తర్వాత తెలుగులో సూర్య స్ట్రైట్ మూవీ ఇదే కానుంది. డబ్బింగ్‍ చిత్రాలతోనే తెలుగులో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు సూర్య.

(4 / 5)

ఈ మూవీలో సూర్య, మమితాతో పాటు రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలకపాత్రలు చేయనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించనున్నారు. 2026 వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది.

(5 / 5)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు