Kanguva Movie: కంగువ మూవీ కోసం సూర్య, దిశా పటానీ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే?
Kanguva Movie: ఈ ఏడాది దక్షిణాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో కంగువ ఒకటి. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది.
(1 / 5)
సూర్య కంగువ మూవీలో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ మూవీతోనే దిశా పటానీ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
(2 / 5)
కంగువ మూవీ కోసం సూర్య తన రెమ్యునరేషన్‌ను దాదాపు ఇరవై కోట్ల వరకు తగ్గించుకున్నట్లు సమాచారం. ఈ మూవీ కోసం 28 కోట్ల రెమ్యునరేషన్‌ను సూర్య అందుకున్నట్లు తెలిసింది.
(3 / 5)
స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో సూర్య చేసిన 24 మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఆ నష్టాలను భర్తీ చేయడానికి సూర్య రెమ్యునరేషన్ తగ్గించుకొని ఈ మూవీ చేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
(4 / 5)
కంగువ మూవీ కోసం దిశా పటానీ 3 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలిసింది. కల్కి కంటే ఓ కోటి ఎక్కువే దిశా పటానీ తీసుకున్నట్లు చెబుతోన్నారు.
ఇతర గ్యాలరీలు