తెలుగు న్యూస్ / ఫోటో /
Warangal Sniffer Dog: సూపర్ స్నిఫర్.. వరంగల్‌లో ఇంటిపై పెంచుతున్న గంజాయిని పట్టేసిన జాగిలం
- Warangal Sniffer Dog: వరంగల్‌లో స్నిఫర్ డాగ్ పోలీసుల్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. మత్తు పదార్ధాల తనిఖీల కోసం వెళ్లిన పోలీస్ జాగిలం వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మేడపై గుట్టుగా పెంచుతున్న గంజాయిని పట్టేసింది. స్టేషన్‌కు 100మీటర్ల దూరంలో ఉన్న గంజాయిని వెదుక్కుంటూ వెళ్లి నిందితుల్ని పసిగట్టేసింది.
- Warangal Sniffer Dog: వరంగల్‌లో స్నిఫర్ డాగ్ పోలీసుల్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. మత్తు పదార్ధాల తనిఖీల కోసం వెళ్లిన పోలీస్ జాగిలం వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మేడపై గుట్టుగా పెంచుతున్న గంజాయిని పట్టేసింది. స్టేషన్‌కు 100మీటర్ల దూరంలో ఉన్న గంజాయిని వెదుక్కుంటూ వెళ్లి నిందితుల్ని పసిగట్టేసింది.
(1 / 5)
వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన పల్లెబోయిన కుమార్ (60), సులభంగా డబ్బు సంపాదనతో పాటు తన అవసరాలకోసం ఏకంగా ఒక గృహపరిశ్రమ తరహాలో తన ఇంటి మేడపైనే పూల కుండీల్లో గంజాయి మొక్కల పెంపకం చేపట్టాడు. గురువారం రైల్వే స్టేషన్లో తనిఖీ లు నిర్వహిస్తుండగా మత్తు పదార్థాలను పసిగట్టే పోలీస్ జాగిలం స్టేషన్‌కు సమీపంలో మేడపైన పెంచుతున్న గంజాయి మొక్కలను గుర్తించింది. ఇంటి యాజమానిని డ్రగ్స్ కంట్రోల్ టీం, పోలీసులు మీల్స్ కాలనీ పోలీస్ అప్పగించారు.
(2 / 5)
వరంగల్ పోలీసులు కొత్తగా తీసుకొచ్చిన స్నిఫర్ డాగ్ తో వరంగల్ రైల్వేస్టేషన్‌లో మత్తు పదార్థాల తనిఖీలు చేపట్టారు. ఆ జాగిలం స్టేషన్ బయటకు వచ్చినపుడు సమీపంలోని ఓ ఇంటికి వెళ్లి మెట్లెక్కసాగింది. తనిఖీలకు కొత్తగా రావడంతో గందరగోళానికి గురవుతోందా అని పోలీసులు అనుమానించారు. దాని వెనుక వెళ్లి చూస్తే.. ఆ ఇంటి యజమాని పూలకుండీల్లో గుట్టుగా పెంచుతున్న గంజాయి మొక్కల్ని కనిపించడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు.
(3 / 5)
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్స్ టీం, ఇంతేజార్ గంజ్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం వరంగల్ రైల్వే స్టేషన్ లో పోలీస్ జాగిలంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు అనుమానస్పదంగా ప్రయాణికుల సామానుతో పాటు, బ్యాగ్ లను పోలీసులు పోలీస్ జాగిలంటో తనిఖీ చేయించారు. ఈ తనిఖీల్లో ఇంట్లో పెంచుతున్న గంజాయి మొక్కల్ని పోలీస్ జాగిలం పసిగట్టడం కలకలం సృష్టించింది.
(4 / 5)
మేడపైన గంజాయి మొక్కలు పెంపకం చేస్తున్న వ్యక్తిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సులభంగా డబ్బు సంపాదించడంతో తన అవసరాల కోసం ఇంటి మేడపై గంజాయి మొక్కల పెంపకాన్ని ప్రారంభించాడు. పోలీసులు జాగిలం గుర్తించడంతో చివరికి పోలీసులకు చిక్కి కటాకటాలు పాలయ్యాడు.
(5 / 5)
వరంగల్ పోలీసు కమిషనరేట్‌కు మత్తు పదార్థాల వాసన చూసి గుర్తించే జాగిలాన్ని తీసుకొచ్చారు. సుమారు 100 మీటర్ల దూరంలో డ్రగ్స్ ఉన్నా గుర్తించడం దీని నైపుణ్యమని హ్యాండ్లర్ తెలిపారు. గురువారం వరంగల్ రైల్వేస్టేషన్‌లో శివనగర్ వైపు ఉన్న ప్లాట్‌ఫారాలపై దానితో తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ సమీపంలో ఉన్న పల్లబోయిన కుమార్ ఇంటికి వెళ్లింది. మేడపైకి ఎక్కి రెండు పూలకుండీల్లో పెంచుతున్న గంజాయి మొక్కల్ని గుర్తించింది. పోలీసులు వెంటనే కుమార్‌ను అదుపులోకి తీసుకొని, మొక్కల్ని స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.
ఇతర గ్యాలరీలు