ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే.. కావ్య పాపకు కన్నీళ్లే.. స‌న్‌రైజ‌ర్స్‌ ఫ్లాప్ షో.. ప్లేఆఫ్స్ కు దూరం-sunrisers hyderabad owner kavya maran in full disappointment srh flop show in ipl 2025 out of play offs contention ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే.. కావ్య పాపకు కన్నీళ్లే.. స‌న్‌రైజ‌ర్స్‌ ఫ్లాప్ షో.. ప్లేఆఫ్స్ కు దూరం

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే.. కావ్య పాపకు కన్నీళ్లే.. స‌న్‌రైజ‌ర్స్‌ ఫ్లాప్ షో.. ప్లేఆఫ్స్ కు దూరం

Published May 06, 2025 09:58 AM IST Chandu Shanigarapu
Published May 06, 2025 09:58 AM IST

ఐపీఎల్ 2025కు ముందు స‌న్‌రైజ‌ర్స్‌ హైదరాబాద్ పై ఎన్నో అంచనాలు. కానీ కట్ చేస్తే సీన్ మొత్తం రివర్సైంది. కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరకుండా ఓనర్ కావ్య మారన్ కు కన్నీళ్లే మిగిల్చింది స‌న్‌రైజ‌ర్స్‌.

ఐపీఎల్ 2025లో స‌న్‌రైజ‌ర్స్‌ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ కు కన్నీళ్లు తప్పలేదు. ఆ టీమ్ కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరడం లేదు. ముందుగానే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.

(1 / 5)

(REUTERS)

గతేడాది ఐపీఎల్ లో స‌న్‌రైజ‌ర్స్‌ విధ్వంసం అంతా ఇంతా కాదు. బ్యాటింగ్ లో చెలరేగిపోయిన ఆ టీమ్ అలవోకగా ప్లేఆఫ్స్ చేరింది. కానీ ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓడింది. ఇప్పుడు ఏడాది కాగానే ఆ టీమ్ ప్రదర్శన పాతాళానికి పడిపోయింది.

(2 / 5)

ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై స‌న్‌రైజ‌ర్స్‌ బౌలింగ్ లో అదరగొట్టింది. 133 రన్స్ కే అపోనెంట్ ను కట్టడి చేసింది. కానీ స‌న్‌రైజ‌ర్స్‌ ఛేజింగ్ కు ముందు వచ్చిన వర్షం టీమ్ ఆశలు ఆవిరి చేసింది. మ్యాచ్ రద్దు కావడంతో స‌న్‌రైజ‌ర్స్‌ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.

(3 / 5)

(AP)

ఐపీఎల్ 2025లో 11 మ్యాచ్ లాడిన స‌న్‌రైజ‌ర్స్‌ కేవలం మూడు మాత్రమే గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ రద్దయింది. దీంతో 7 పాయింట్లు మాత్రమే గెలిచింది. మిగిలిన మూడు మ్యాచ్ ల్లో గెలిచినా స‌న్‌రైజ‌ర్స్‌ ప్లేఆఫ్స్ చేరే అవకాశం లేదు. అందుకే ముందుగానే ఆ టీమ్ రేసు నుంచి ఔటైపోయింది.

(4 / 5)

(Surjeet Yadav)

కాటేరమ్మ కొడుకులు, విధ్వంసకారులు.. ఇలా స‌న్‌రైజ‌ర్స్‌ బ్యాటర్లుకు ఎన్నో ఎలివేషన్లు. 300 కొడతారంటూ అంచనాలు. కానీ కథ అడ్డం తిరిగింది. బ్యాటింగ్ లో అభిషేక్, హెడ్, నితీశ్, క్లాసెన్, ఇషాన్ వైఫల్యం.. బౌలింగ్ లో షమి, హర్షల్ ఫెయిల్యూర్ కలిసి స‌న్‌రైజ‌ర్స్‌ను నిండా ముంచాయి.

(5 / 5)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు