IPL 2024: ఎస్‍ఆర్‌హెచ్‍కు ఎదురుదెబ్బ.. ఈ సీజన్‍కు స్టెయిన్ దూరం!-sunrisers hyderabad bowling coach dale steyn out of ipl 2024 cricket news in telugu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ipl 2024: ఎస్‍ఆర్‌హెచ్‍కు ఎదురుదెబ్బ.. ఈ సీజన్‍కు స్టెయిన్ దూరం!

IPL 2024: ఎస్‍ఆర్‌హెచ్‍కు ఎదురుదెబ్బ.. ఈ సీజన్‍కు స్టెయిన్ దూరం!

Mar 02, 2024, 07:06 PM IST Chatakonda Krishna Prakash
Mar 02, 2024, 07:06 PM , IST

  • IPL 2024 - Dale Steyn: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం సిద్ధమవుతున్న సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. జట్టు బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్.. ఈ సీజన్‍కు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. వివరాలివే..

ఈ ఏడాది ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22న మొదలుకానుంది. ఈ తరుణంలో సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు షాక్ ఎదురైంది. ఆ టీమ్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్.. ఈ సీజన్‍కు దూరం కానున్నాడు. 

(1 / 5)

(Photo: X)

ఐపీఎల్ 2024 సీజన్‍కు దూరంగా ఉండాలని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ స్టెయిన్ నిర్ణయించుకున్నాడని క్రిక్‍బజ్ రిపోర్ట్ వెల్లడించింది. గతేడాది ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ కోచ్‍గా వ్యవహరించిన అతడు.. ఈ ఏడాది బ్రేక్ కావాలని ఫ్రాంచైజీని కోరాడని తెలుస్తోంది. 

(2 / 5)

మళ్లీ వచ్చే ఏడాది జట్టుతో కలుస్తానని ఎస్‍ఆర్‌హెచ్‍కు స్టెయిన్ తెలిపాడట. దీంతో ఈ ఏడాది సీజన్ కోసం కొత్త బౌలింగ్ కోచ్‍ను వెతికే పనిని హైదరాబాద్ ఇప్పటికే షురూ చేసిందని సమాచారం. 

(3 / 5)

(AFP)

కొత్త బౌలింగ్ కోచ్‍ విషయంలో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది. హెడ్ కోచ్ డానియల్ వెటోరీ ఈ విషయంపై కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. 

(4 / 5)

(Sunrisers Hyderabad)

మరోవైపు, ఐపీఎల్ 2024 కోసం ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్‌ను సన్‍రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‍గా నియమిస్తుందని రూమర్లు ఉన్నాయి. ఈ సీజన్ కోసం వేలంలో రూ.20.50 కోట్ల భారీ ధరతో కమిన్స్‌ను ఎస్‍ఆర్‌హెచ్ సొంతం చేసుకుంది. ఈ సీజన్‍లో మార్చి 23న తన తొలి మ్యాచ్ ఆడనుందని ఎస్ఆర్‌హెచ్. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు