(1 / 5)
ఐపీఎల్లో భాగంగా సోమవారం (మే 19) ఏకనా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్ లో హర్షల్ పటేల్ పేలవంగా బౌలింగ్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో ఏడెన్ మార్‌క్రమ్ వికెట్ తీయడం ద్వారా ఓ అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
(2 / 5)
మార్‌క్రమ్ వికెట్ తీసిన వెంటనే హర్షల్ పటేల్ తన ఐపీఎల్ కెరీర్లో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్లో 150 వికెట్లు తీసిన 13వ బౌలర్ గా నిలిచాడు. ఇక ఈ ఘనత సాధించిన 9వ ఇండియన్ బౌలర్ అతడు.
(Reuters)(3 / 5)
ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన హర్షల్ పటేల్ ఇప్పుడు అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన ఘనతను సొంతం చేసుకున్నాడు. అతడు 2381 బంతుల్లో 150 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంకకు చెందిన లసిత్ మలింగ పేరిట ఉండేది. ఐపీఎల్లో 2444 బంతులు విసిరి 150 వికెట్లు పడగొట్టాడు.
(PTI)(4 / 5)
ఈ జాబితాలో భారత స్పిన్నర్ యుజువేంద్ర చహల్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అతడు 2543 బంతుల్లో 150 వికెట్లు పడగొట్టాడు. హర్షల్ 177 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడి ఈ ఘనత సాధించాడు.
(PTI)(5 / 5)
హర్షల్ పటేల్ 2021లో ఆర్సీబీ తరఫున ఆడి ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. 2024లో పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగి మళ్లీ పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో హర్షల్ ఇప్పటివరకు 11 మ్యాచ్ లలో ఆడి 15 వికెట్లు పడగొట్టాడు.
(Reuters)ఇతర గ్యాలరీలు