తెలుగు న్యూస్ / ఫోటో /
Regina Cassandra: బాలీవుడ్ సినిమాలో రెజీనాకు ఛాన్స్ - సన్నీడియోల్, గోపీచంద్ మలినేని మూవీ లాంఛ్!
Regina Cassandra:గదర్ 2 హీరో సన్నీడియోల్, టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో ఓ బాలీవుడ్ మూవీ రాబోతోంది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ గురువారం అఫీషియల్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
(1 / 5)
సన్నీడియోల్, గోపీచంద్ మలినేని మూవీని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తోన్నాయి.
(2 / 5)
ఈ యాక్షన్ మూవీతోనే గోపీచంద్ మలినేని డైరెక్టర్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. జూన్ 22 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్‌చేశారు.
(3 / 5)
సన్నీడియోల్ మూవీలో రెజీనాతో పాటు సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ మూవీతో రెజీనా బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది.
(4 / 5)
సన్నీ డియోల్ హీరోగా గత ఏడాది రిలీజైన గదర్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. చాలా ఏళ్ల తర్వాత ఈ మూవీతో హిట్ అందుకున్నాడు సన్నీడియోల్.
ఇతర గ్యాలరీలు