(1 / 5)
సరిగ్గా తెల్లవారుజామున 3.27 గంటలకు సునీతా విలియమ్స్ స్పేస్ క్రాఫ్ట్ అట్లాంటిక్ మహాసముద్రంలో ల్యాండ్ అయింది. 55 నిమిషాల తర్వాత సునీత స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి నిష్క్రమించారు. ఆమె మొహంలో చిరునవ్వు కనిపించింది. ఆమె కేవలం భారత సంతతికి చెందిన వారే కాదు, (ఫోటో: రాయిటర్స్)
(2 / 5)
న్యూస్ 18 నివేదిక ప్రకారం, ఫాల్గుణి ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహాకుంభ్ మేళాను సందర్శించినట్లు చెప్పారు. ఆ సమయంలో మహాకుంభమేళా ఫొటోలను సునీతకు పంపినట్టు చెప్పారు. అంతరిక్షం నుంచి మహాకుంభమేళా ఎలా ఉంటుందో సునీత కూడా ఆమెకు ఓ ఫొటోను పంపించారు. (ఫోటో సౌజన్యం: ఏఎఫ్పీ, X@NewJerseyIndia)
(3 / 5)
సునీత కూడా వినాయకుడి విగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లిందని ఫాల్గుణి చెప్పారు. అంతరిక్షంలో (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్) తేలియాడుతున్న వినాయకుడి ఫొటోను సునీత పంపినట్లు ఫల్గుణి తెలిపారు. త్వరలోనే సునీతతో కలిసి ఇండియాకు వచ్చే యోచనలో ఉన్నట్లు ఫాల్గుణి తెలిపారు. (ఫోటో: ఏఎఫ్పీ)
(4 / 5)
సునీతకు ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని ఫాల్గుణి చెప్పింది. ఈ సందర్భంగా ఫాల్గుణి మాట్లాడుతూ.. 'సునీతకు ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సునీతకు ఇష్టమైన భారతీయ వంటకాల జాబితాలో సమోసాలు అగ్రస్థానంలో ఉంటాయి. తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత కూడా సమోసాను తీసుకెళ్లారు. (ఫోటో: ఏఎఫ్పీ)
ఇతర గ్యాలరీలు