Nutrient-packed seeds: ఈ సీడ్స్ రోజూ తినండి; ఇమ్యూనిటీ, వైటాలిటీ మీ సొంతం
Nutrient-packed seeds: ఈ విత్తనాలు పోషకాలతో నిండి ఉన్నాయి. వాటిని ప్రతీ రోజు ఆహారం లో భాగం చేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు చాలా ప్రయోజనాలు ఉంటాయి.
(1 / 7)
పోషకాహార రంగంలో, విత్తనాలు మినియేచర్ పవర్‌హౌస్‌లుగా నిలుస్తాయి, ఒక్కో రకం ఒక్కో రకమైన ఆరోగ్య ప్రయోజనాలను అందజేస్తాయి.(Freepik)
(2 / 7)
Sunflower seeds: ఈ పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. ఇది మీ చర్మాన్ని కాంతిమంతం చేయడమే కాకుండా జుట్టు పెరుగుదలకు దోహదపడ్తాయి.(Shutterstock)
(3 / 7)
Pumpkin seeds: ఈ గుమ్మడి గింజల్లో సంతానోత్పత్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. అలాగే, వీటిలో జింక్ ఉంటుంది. అది మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ఈ విత్తనాలు జీవశక్తిని ప్రోత్సహిస్తాయి.(Pixabay)
(4 / 7)
Chia seeds: ఈ చియా సీడ్స్ ఒమేగా-3 రిచ్‌నెస్‌ను కలిగి ఉంటాయి. గుండె ఆరోగ్యానికి ఇవి అత్యుత్తమం. మీ జీవ శక్తిని పెంపొందిస్తాయి.(pixabay)
(5 / 7)
Black sesame seeds: ఈ నల్ల నువ్వులు వృద్ధాప్యాన్ని అడ్డుకుంటాయి. వీటిలోని మెలనిన్ చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది. నల్ల నువ్వులు జుట్టు ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపరుస్తాయి. తెల్ల జుట్టు రాకుండా అడ్డుకుంటాయి. (Unsplash)
(6 / 7)
Flax seeds: అవిసె గింజలతో హార్మోన్ ఇంబాలెన్స్ సమస్య దూరమవుతుంది. ఇవి రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. తద్వారా గుండె జబ్బులను అడ్డుకుంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. (Unsplash)
ఇతర గ్యాలరీలు