మరో రెండు రోజుల్లో వీరి అదృష్టం మారనుంది.. జీవితంలో ఊహించని మార్పులు, ఆర్థిక లాభాలు!-sun transit in rohini nakshatra before lord shani jayanti will make these zodiac signs rich and give huge luck ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మరో రెండు రోజుల్లో వీరి అదృష్టం మారనుంది.. జీవితంలో ఊహించని మార్పులు, ఆర్థిక లాభాలు!

మరో రెండు రోజుల్లో వీరి అదృష్టం మారనుంది.. జీవితంలో ఊహించని మార్పులు, ఆర్థిక లాభాలు!

Published May 23, 2025 08:39 PM IST Anand Sai
Published May 23, 2025 08:39 PM IST

జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం సూర్యుని నక్షత్ర మార్పు శని జయంతికి ముందు అంటే మే 25న జరుగుతుంది. ఈ సంచారం ముఖ్యంగా 3 రాశుల వారికి పురోగతి, సంపద, కుటుంబ ఆనందాన్ని తెస్తుంది.

శని జయంతి పండుగ మొదటి అమావాస్య రోజున అంటే మే 27న జరుపుకొంటారు. శని జయంతి రోజు శని దేవుడిని ప్రత్యేక పూజించడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈసారి శని జయంతికి రెండు రోజుల ముందు మరొక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. అది సూర్యుని సంచారం. జ్యోతిషశాస్త్ర గణనల ప్రకారం మే 25న సూర్యుడు రోహిణిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం మూడు రాశుల వారికి చాలా శుభ ఫలితాలను తెస్తోంది.

(1 / 4)

రోహిణి నక్షత్రంలో సూర్యుని సంచారం కారణంగా వృషభ రాశి వ్యక్తులు జీవితంలోని అనేక రంగాలలో శుభ మార్పులను చూడవచ్చు. కెరీర్, ఆర్థికం, కుటుంబ జీవితం అన్నీ మెరుగుపడతాయి. ఈ సమయంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందవచ్చు. మీరు చాలా కాలంగా అవకాశం కోసం చూస్తున్నట్లయితే.. ఈ సమయం మీకు ఫలవంతమైనది అవుతుంది. పెట్టుబడి నుండి మంచి లాభం వచ్చే సూచనలు ఉన్నాయి.

(2 / 4)

సింహ రాశి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారికి ఈ సూర్య సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయం మిమ్మల్ని కొత్త విజయాలకు దారి తీస్తుంది. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. మీరు ఉన్నత స్థానానికి పదోన్నతి పొందవచ్చు. మీరు నాయకత్వ పాత్ర పోషిస్తుంటే, మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం ప్రశంసించబడుతుంది. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోవచ్చు నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. మీ కుటుంబం నుండి మీకు కొన్ని శుభవార్తలు రావచ్చు.

(3 / 4)

మకర రాశి వారిపై సూర్యుడు, శని ప్రభావం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ సమయం కృషి, ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. మీకు కొత్త బాధ్యతలు రావొచ్చు. ఇది మీ కెరీర్‌లో ఒక మైలురాయి కావచ్చు. పెద్దల నుండి మీకు మద్దతు లభిస్తుంది. పదోన్నతికి బలమైన అవకాశాలు ఉన్నాయి. కొత్త సంపాదనా అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగం లేదా సాంకేతిక రంగాలలో పనిచేసే వారు ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చు. సమాజంలో మీ పేరు, గౌరవం పెరుగుతాయి.

(4 / 4)

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు