(1 / 5)
సూర్యుడు మీనరాశిలో ప్రవేశించాడు. ఇప్పటికే ఆ రాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. దీంతో నిన్న (మార్చి 14) బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. శుక్రుడు కూడా అదే రాశిలో ఉన్నాడు. దీంతో సూర్య, శుక్రుల కలయికతో శుక్రాదిత్య యోగం సంభవించింది. సూర్యుడు మీనంలో ఉండే ఏప్రిల్ 14 వరకు ఈ రెండు రాజయోగాలు ఉండనున్నాయి. అప్పటి వరకు నాలుగు రాశుల వారికి బాగా అదృష్టం, మంచి టైమ్ ఉండనుంది.
(2 / 5)
కుంభం: సూర్యుడి సంచారంతో మీనరాశిలో ఏర్పడిన ఈ రెండు రాజయోగాల వల్ల కుంభ రాశి వారికి మంచి టైమ్ మొదలైపోయింది. ఈ కాలంలో వీరికి చాలా విషయాల్లో లక్ కలిసి వస్తుంది. ధనపరమైన విషయాల్లో లాభాలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. ఆనందంగా సమయం గడుపుతారు. మనసుకు ఉల్లాసం కలిగించే పనులు చేస్తారు.
(3 / 5)
ధనూ రాశి: బుధాదిత్య, శుక్రాదిత్య యోగాల వల్ల ధనూ రాశి వారికి అదృష్టం మెండుగా ఉంటుంది. ఈకాలంలో వీరు చేసే పనుల్లో ఎక్కువ శాతం సక్సెస్ అవుతాయి. ఆర్థికంగా పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశాలు ఎక్కువ. సమాజంలో గౌరవం, పరపతి ఎక్కువవుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి.
(4 / 5)
వృషభం: ఈ కాలంలో వృషభ రాశి వారికి శుభాలు కలుగుతాయి. సాధారణం కంటే ధనం ఎక్కువగా దక్కుతుంది. వ్యాపారులు, ఉద్యోగులకు డబ్బు విషయాల్లో ఎక్కువ అదృష్టం ఉండే అవకాశం ఉంటుంది. బకాయి సొమ్ము చేతికి అందొచ్చు. కుటుంబంతో సమయం సంతోషంగా గడుపుతారు. పెళ్లి కోసం ప్రయత్నించే వారికి ఫలితాలు బాగుంటాయి.
(5 / 5)
తుల: మీనరాశిలో బుధాదిత్య, శుక్రాదిత్య రాజయోగాలు ఉండే కాలం తులారాశి వారికి ప్రయోజనకరం. ఈ కాలంలో వీరికి అదృష్టం సపోర్ట్ చేస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొందరికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కోర్టు కేసులు ఏమైనా ఉంటే సానుకూలంగా పరిస్థితులు ఉండొచ్చు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే, ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు