ఈ నాలుగు రాశుల వారికి అదృష్ట యోగం రానుంది.. ఆర్థిక లాభాలు, సంతోషం, కలిసొచ్చే పరిస్థితులు!
- మరో రెండు రోజుల్లో సూర్యుడు.. రాశి మారనున్నాడు. మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల నాలుగు రాశులకు విపరీతంగా కలిసి రానుంది. చాలా లాభాలు కలుగుతాయి.
- మరో రెండు రోజుల్లో సూర్యుడు.. రాశి మారనున్నాడు. మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల నాలుగు రాశులకు విపరీతంగా కలిసి రానుంది. చాలా లాభాలు కలుగుతాయి.
(1 / 5)
గ్రహాలకు రారాజైన సూర్యుడు మరో రెండు రోజుల్లో ఏప్రిల్ 14న మేషరాశిలోకి అడుగుపెట్టనున్నాడు. మే 15వ తేదీన వరకు అదే రాశిలో సంచరిస్తాడు. మేషరాశిలో సూర్యుడు సంచరించే కాలం నాలుగు రాశుల వారికి ఎక్కువగా కలిసి రానుంది. అదృష్టయోగం ఉంటుంది.
(2 / 5)
సింహం: మేషరాశిలో సూర్యుడు సంచరించే కాలం సింహరాశి వారికి అదృష్టం మెండుగా ఉంటుంది. వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనాలు అధికంగా కలుగుతాయి. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చాలా పనులు సక్సెస్‍ఫుల్‍గా పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.
(3 / 5)
మీనం: ఈ కాలంలో మీనరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కొందరికి ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు జరగొచ్చు. ఉద్యోగులకు ఆర్థికపరమైన ప్రయోజనాలు దక్కుతాయి. పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది.
(4 / 5)
కర్కాటకం: ఈకాలంలో కర్కాటక రాశి వారికి కూడా మంచి టైమ్ నడుస్తుంది. వీరికి ధనపరమైన విషయాల్లో బాగా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అదృష్టం మద్దతు ఉండడంతో చాలా పనులు విజయవంతం అవుతాయి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు.
(5 / 5)
మిథునం: మేషరాశిలో సూర్యుడు సంచరించే కాలంలో మిథున రాశి వారికి మేలు జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో ఏవైనా వివాదాలు ఉంటే పరిష్కారం కావొచ్చు. పెళ్లి కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల అనుసారం ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు