ఈ రాశుల వారికి గుడ్‍టైమ్ షురూ.. కొత్త అవకాశాలు, ధన యోగం!-sun jupiter comes face to face these zodiac sings to get benefits ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ రాశుల వారికి గుడ్‍టైమ్ షురూ.. కొత్త అవకాశాలు, ధన యోగం!

ఈ రాశుల వారికి గుడ్‍టైమ్ షురూ.. కొత్త అవకాశాలు, ధన యోగం!

Nov 16, 2024, 07:13 PM IST Chatakonda Krishna Prakash
Nov 16, 2024, 07:08 PM , IST

  • సూర్యుడి రాశి మార్పుతో ఓ విశేషం జరిగింది. సూర్యుడు, గురువు ముఖాముఖి వచ్చేశారు. కొన్ని రాశుల వారికి నేటి (నవంబర్ 16) నుంచే ఇది కలిసి రానుంది.

గ్రహాల రారాజు సూర్యుడు సుమారు నెలకు ఓసారి రాశి మారుతాడు. సూర్యుడి సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నేడు (నవంబర్ 16) వృశ్చిక రాశిలోకి సూర్యుడు అడుగుపెట్టాడు. అయితే, దీనికి ఓ విశేషం కూడా కలిసి వచ్చింది. 

(1 / 6)

గ్రహాల రారాజు సూర్యుడు సుమారు నెలకు ఓసారి రాశి మారుతాడు. సూర్యుడి సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నేడు (నవంబర్ 16) వృశ్చిక రాశిలోకి సూర్యుడు అడుగుపెట్టాడు. అయితే, దీనికి ఓ విశేషం కూడా కలిసి వచ్చింది. (freepik)

గురువు (బృహస్పతి) ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు. వృశ్చికంలోకి నేడు సూర్యుడు ప్రవేశించాడు. దీంతో ప్రస్తుతం సూర్యుడు, గురువు ముఖాముఖిగా వచ్చేశారు. 180 డిగ్రీల కోణంలో పరస్పరం చూసుకుంటున్నారు. వృశ్చికంలో సూర్యుడు ఉండే డిసెంబర్ 15 వరకు ఇది ఉండనుంది. ఈ కాలంలో నాలుగు రాశుల వారికి అదృష్టం అధికమవుతుంది. 

(2 / 6)

తులా: సూర్యుడు, గురువు ముఖాముఖి వల్ల తులారాశి వారికి అదృష్టం మెండుగా ఉంటుంది. ఈ కాలంలో వీరికి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. కెరీర్లో ఎదుగుదల ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు, ఉద్యోగులకు ఎదిగేందుకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. 

(3 / 6)

కర్కాటకం: ఈ కాలం కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. చేసే పనుల్లో అధిక శాతం విజయం సిద్ధిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. 

(4 / 6)

కుంభం: ఈ కాలంలో కుంభ రాశి వారి అదృష్టం సానుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు దక్కొచ్చు. ఉద్యోగస్తులకు సహచరుల నుంచి సపోర్ట్ అధికం అవుతుంది. కెరీర్లో వృద్ధి ఉంటుంది. 

(5 / 6)

కన్య: సూర్యుడు, గురువు ముఖాముఖి వల్ల కన్యా రాశి వారికి మేలు కలుగుతుంది. చాలా కాలంగా ఉన్న కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాజంలో గౌరవం అధికం అవుతుంది. వ్యాపారులు మంచి లాభాలు చూసే ఛాన్స్ ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల గురించి తెలుసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు