దంగల్ నటి సుహానీ మరణానికి అసలు కారణం ఇదే- ప్రపంచంలో ఐదుగురికే ఈ వ్యాధి!
- దంగల్ నటి సుహానీ భట్నాగర్ మరణ వార్త సినీ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. 19ఏళ్లకే ఆమె మరణించడం.. దిగ్భ్రాంతికి గురుచేస్తున్న విషయం. అయితే.. ఆమె ప్రమాదకరమైన, అరుదైన డెర్మాటోమియోసిటిస్ వ్యాధి బారిన పడి మరణించారని తెలుస్తోంది.

(1 / 5)
డెర్మాటోమియోసిటిస్ అనేది ఒక అరుదైన ఇన్ఫ్లమెటరీ వ్యాధి. చర్మంపై దద్దర్లు వస్తాయి. కండలు బలహీనపడిపోతాయి. ఈ వ్యాధి సోకితే.. పల్మొనరీ, కార్డియోవాస్క్యులర్, గ్యాస్ట్రోఇన్టెస్టైనల్ సిస్టెమ్కు సంబంధించిన అవయవాలు దెబ్బ తింటాయి.
(2 / 5)
సుహానీ భట్నాగర్‌కి రెండు నెలల ముందు నుంచి వ్యాధి లక్షణాలు ఉన్నాయి. కానీ 10 రోజుల క్రితమే పరిస్థితి విషమించింది. ఆమె ఫిబ్రవరి 7న దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన తర్వాతే.. సుహానీకి డెర్మాటోమియోసిటిస్ సోకిందని నిర్ధరణ అయ్యింది.
(3 / 5)
"రెండు నెలల క్రితం సుహానీ చేతులపై ఎర్రటి మచ్చలు మొదలయ్యాయి. చాలా మంది డాక్టర్లను కన్సల్ట్ చేశాము. కానీ ఎవరు కారణం చెప్పలేకపోయారు," అని ఆమె తల్లి చెప్పారు.
(4 / 5)
"సుహానీకి అరుదైన వ్యాధి సోకింది. ప్రపంచంలో కేవలం ఐదు నుంచి ఆరుగురికి మాత్రమే ఈ డెర్మాణోమియోసిటిస్ వ్యాధి సోకింది," అని వైద్యులు తనకి చెప్పినట్టు.. దంగల్ నటి తండ్రి చెప్పారు.
ఇతర గ్యాలరీలు