(1 / 6)
నెల రోజుల క్రితం, సెప్టెంబర్ 26వ తేదీన సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 86,000ను తాకింది. అయితే అప్పటి నుంచి సెన్సెక్స్ 80,000 దిగువకు పడిపోయింది. కేవలం నెల రోజుల్లో స్టాక్ మార్కెట్లో ఈ భారీ పతనం చోటు చేసుకుంది. శుక్రవారం సెన్సెక్స్ దాదాపు 1 శాతం పతనమైంది.
(PTI)(2 / 6)
అక్టోబర్ 25, శుక్రవారం స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 663 పాయింట్లు (0.8 శాతం) నష్టపోయింది. వారాంతం ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ 79402 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ నిన్న 219 పాయింట్లు (0.9 శాతం) నష్టపోయింది. నిఫ్టీ ప్రస్తుతం 24,181 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ, సెన్సెక్స్ దాదాపు రెండున్నర నెలల కనిష్ట స్థాయిలను తాకాయి.
(REUTERS)(3 / 6)
స్టాక్ మార్కెట్ పతనానికి ప్రధాన కారణం ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని, చైనా మార్కెట్లో పెట్టుబడులుగా పెట్టడమని నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్లో ఎఫ్పీఐ లు భారత స్టాక్ మార్కెట్లో ఎఫ్పీఐలు రూ.98,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ ఎఫ్పీఐలు చైనా స్టాక్ మార్కెట్ వైపు కదులుతున్నారు.
(PTI)(4 / 6)
అధికారిక గణాంకాల ప్రకారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ మొత్తం క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ.444.5 లక్షల కోట్లుగా ఉంది. సెప్టెంబర్ 26న సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. దీంతో సెన్సెక్స్ 85,836 పాయింట్లకు చేరింది. అక్కడి నుంచి ఒక్క నెలలోనే 6434 పాయింట్లు పతనమయ్యాయి.
(PTI)(5 / 6)
బాంబే స్టాక్ ఎక్సేంజ్ స్మాల్ క్యాపిటల్ ఇండెక్స్ 2.4 శాతం క్షీణించింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.4 శాతం క్షీణించింది. నిన్న భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద రూ.7 లక్షల కోట్లు ఆవిరయింది.
(PTI)ఇతర గ్యాలరీలు