(1 / 5)
ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో భారత్ చేతిలో ఓటమి తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ వన్డేలకు వీడ్కోలు పలికాడు. మార్చి 5న రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. స్మిత్ 170 వన్డేల్లో 5800 పరుగులు చేశాడు.
(Surjeet Yadav)(2 / 5)
టీమిండియా కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ హఠాత్తుగా టెస్టులకు రిటైర్మెంట్ తో షాక్ ఇచ్చాడు. మే 7న రోహిత్ టెస్టులను వదిలేశాడు. 67 టెస్టుల్లో 4301 పరుగులు చేశాడు హిట్ మ్యాన్.
(AFP)(3 / 5)
రోహిత్ శర్మ బాటలోనే సాగిన విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. రోహిత్ అనౌన్స్ చేసిన అయిదు రోజులకే కోహ్లి కూడా టెస్టు రిటైర్మెంట్ ప్రకటించాడు. మే 12న టెస్టులకు గుడ్ బై చెప్పాడు. 123 టెస్టుల్లో కోహ్లి 9230 పరుగులు చేశాడు.
(ANI Picture Service Wire)(4 / 5)
ఈ రోజు (జూన్ 2) ఆస్ట్రేలియా డేంజరస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ స్టార్ ప్లేయర్ 149 వన్డేల్లో 3990 పరుగులు చేశాడు.
(PTI)(5 / 5)
మ్యాక్స్ వెలా లాగే క్లాసెన్ కూడా సోమవారం (జూన్ 2) క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. ఈ దక్షిణాఫ్రికా పవర్ హిట్టర్ 4 టెస్టులు, 60 వన్డేలు, 58 టీ20లు ఆడాడు.
(PTI)ఇతర గ్యాలరీలు