(1 / 5)
2010 ఫిబ్రవరి 5న పాకిస్థాన్ తో మెల్ బోర్న్ లో వన్డేతో 50 ఓవర్ల ఫార్మాట్లో స్మిత్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసి 8 పరుగులు సాధించాడు.
(Surjeet Yadav)(2 / 5)
అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా తరపున స్మిత్ 170 వన్డేలాడాడు. 154 వన్డే ఇన్నింగ్స్ ల్లో 5800 పరుగులు చేశాడు. అతని సగటు 43.28. ఇందులో 12 సెంచరీలున్నాయి. 35 హాఫ్ సెంచరీలున్నాయి. చివరి వన్డేలో భారత్ పై హాఫ్ సెంచరీతో మెరిశాడు.
(REUTERS)(3 / 5)
రెండు వన్డే ప్రపంచకప్ లతో స్మిత్ కెరీర్ ముగించాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చిన 2015 ప్రపంచకప్ గెలిచిన జట్టులో స్మిత్ సభ్యుడు. భారత్ లో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్ లోనూ విశ్వ విజేతగా నిలిచిన ఆసీస్ జట్టులో స్మిత్ ఉన్నాడు.
(REUTERS)(4 / 5)
64 వన్డేల్లో ఆస్ట్రేలియాను స్మిత్ నడిపించాడు. అత్యధిక వన్డేల్లో ఆసీస్ కెప్టెన్ గా వ్యవహరించిన ఆరో క్రికెటర్ గా స్మిత్ నిలిచాడు. స్మిత్ కెప్టెన్సీలో ఆసీస్ 64 వన్డేల్లో 32 గెలిచింది. 28 ఓడిపోయింది. 4 ఫలితం తేలలేదు.
(PTI)(5 / 5)
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆసీస్ బ్యాటర్లలో స్మిత్ 12వ స్థానంలో ఉన్నాడు. సెంచరీల రికార్డులో మాత్రం ఆరో స్థానంలో ఉన్నాడు. అతను వన్డేల్లో 12 సెంచరీలు బాదాడు. వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన ఆసీస్ కెప్టెన్ గా రికార్డు స్మిత్ సొంతం.
(PTI)ఇతర గ్యాలరీలు