Valentines day: ఈ స్టార్ క్రికెటర్స్.. లవ్ గేమ్ లోనూ విన్నర్స్.. ఈ ఆటగాళ్ల ప్రేమ కహానీలు తెలుసా?-star cricketers love stories valentines day sachin kohli dhoni rohit bumrah ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Valentines Day: ఈ స్టార్ క్రికెటర్స్.. లవ్ గేమ్ లోనూ విన్నర్స్.. ఈ ఆటగాళ్ల ప్రేమ కహానీలు తెలుసా?

Valentines day: ఈ స్టార్ క్రికెటర్స్.. లవ్ గేమ్ లోనూ విన్నర్స్.. ఈ ఆటగాళ్ల ప్రేమ కహానీలు తెలుసా?

Published Feb 14, 2025 03:58 PM IST Chandu Shanigarapu
Published Feb 14, 2025 03:58 PM IST

Valentines day: వాలంటైన్స్ డే సందర్భంగా ప్రపంచమంతా ప్రేమ మయంగా మారింది. ఎక్కడ చూసిన ఇవే వలపు కబుర్లు. మరి లవ్ చేసి, మ్యారేజీ చేసుకున్న స్టార్ క్రికెటర్లూ ఉన్నారు. వీళ్ల స్టోరీల్లోనూ ఎన్నో ట్విస్ట్ లున్నాయి. అలాంటి అగ్రశ్రేణి క్రికెటర్ల ప్రేమ కహానీలేంటో ఇక్కడ తెలుసుకోండి.  

సచిన్- అంజలి తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. 1990 లో ఇంగ్లండ్ టూర్ ముగించుకుని వచ్చిన సచిన్ ఎయిర్ పోర్ట్ లో అంజలిని చూశాడు. 22 ఏళ్ల సచిన్ ను చూడగానే ఎంతో క్యూట్ గా ఉన్నాడని అంజలి చెప్పారంటా. ఆ తొలి పరిచయంతోనే ప్రేమలో పడ్డ ఈ జంట.. అయిదేళ్ల డేటింగ్ తర్వాత 1995లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. 

(1 / 5)

(x/sachin)

క్రికెట్ వర్గాల్లో బాగా పాపులర్ అయిన మరో లవ్ పెయిర్ విరాట్ కోహ్లి- అనుష్క. బాలీవుడ్ నటి అయిన అనుష్క, కోహ్లి కలిసి 2013లో ఓ షాంపూ యాడ్ షూట్ చేశారు. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మనసులు కలిశాయి. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా.. మళ్లీ దగ్గరైన ఈ జోడీ 2017లో వివాహం చేసుకుంది. విరుష్క అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ జంటకు ఇద్దరు పిల్లలు.

(2 / 5)

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిది మరో స్పెషల్ లవ్ స్టోరీ. సాక్షి, ధోని చిన్నప్పుడు ఒకే పాఠశాలకు వెళ్లారు. కానీ సాక్షి కుటుంబం డెహ్రాడూన్ కు షిష్ట్ అవడంతో అప్పుడు దూరమయ్యారు. భారత జట్టులోకి ధోని వచ్చిన తర్వాత ఓ హోటల్ లో ఇంటర్న్ షిప్ చేస్తున్న సాక్షిని మళ్లీ కలిశాడు. 2008 లో మొదలైన వీళ్ల ప్రేమ కథ 2012లో పెళ్లికి చేరుకుంది. ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది.  

(3 / 5)

(ANI)

భారత వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ లవ్ స్టోరీలోనూ ట్విస్ట్ లున్నాయి. అతని భార్య రితిక మొదట రోహిత్ కు మేనేజర్. ఓ యాడ్ షూట్ లో రితికను మొదటి సారి కలిశాడు. ఆ తర్వాత రోహిత్ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ ను రితిక చూసుకునేది. ఆ ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ కాస్తా పర్సనల్ గా మారింది. ఆరేళ్ల డేటింగ్ తర్వాత వీళ్లు 2015లో పెళ్లి పీఠలెక్కారు. ఈ దంపతులకు ఓ తనయ ఉంది. 

(4 / 5)

(x/Rohit Sharma)

క్రికెటర్, యాంకర్ మధ్య లవ్ స్టోరీకి బుమ్రా-సంజన గణేషన్ బెస్ట్ ఉదాహరణ.  సంజన్ క్రికెట్ ప్రజెంటేటర్ గా పనిచేసే సమయంలో 2013-14 ఐపీఎల్ లో బుమ్రాను ఇంటర్వ్యూ చేసింది.  అప్పుడే ఇద్దరి మధ్య స్నేహం మొదలైైంది. ఆ  తర్వాత అది ముదిరి ప్రేమగా మారింది. రెండేళ్ల డేటింగ్ తర్వాత వీళ్లు 2021లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఓ కొడుకున్నాడు. 

(5 / 5)

(x/Jay Cricket.)

Chandu Shanigarapu

eMail
WhatsApp channel

ఇతర గ్యాలరీలు