Srisailam Fishermen : అద్భుతం ! శ్రీశైలం డ్యామ్ వద్ద మత్స్యకారుల చేపల వేట
- Srisailam Fishermen : ఎగువ నుంచి వరద నీరు తగ్గడంతో శ్రీశైలం డ్యామ్ గేట్లు మూసివేశారు. దీంతో స్థానిక మత్స్యకారులు దిగువ ప్రవాహంలో చేపల వేటకు సిద్ధమయ్యారు. చిన్న చిన్న తెప్పల్లో చేపల వేటకు వెళ్తున్న దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి.
- Srisailam Fishermen : ఎగువ నుంచి వరద నీరు తగ్గడంతో శ్రీశైలం డ్యామ్ గేట్లు మూసివేశారు. దీంతో స్థానిక మత్స్యకారులు దిగువ ప్రవాహంలో చేపల వేటకు సిద్ధమయ్యారు. చిన్న చిన్న తెప్పల్లో చేపల వేటకు వెళ్తున్న దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి.
(1 / 6)
ఎగువ నుంచి వరద నీరు తగ్గడంతో శ్రీశైలం డ్యామ్ గేట్లు మూసివేశారు. దీంతో స్థానిక మత్స్యకారులు దిగువ ప్రవాహంలో చేపల వేటకు సిద్ధమయ్యారు. చిన్న చిన్న తెప్పల్లో చేపల వేటకు వెళ్తున్న దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి.
(2 / 6)
వరద నీరు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయంలో మత్స్యకారులు చిన్న పడవల్లో చేపల వేటకు బయల్దేరారు. రిజర్వాయర్‌లో ఈ పడవల దృశ్యాలు మత్స్యకారులు చేపలు పట్టుకోవడానికి చూపుతున్న ఆసక్తిని తెలియజేస్తున్నాయి.
(3 / 6)
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద మత్స్యకారుల పడవల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మత్స్యకారులకు ఎలాంటి లైఫ్ జాకెట్లు లేకుండా చేపల వేటకు వెళ్లడంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. మత్స్యకారులకు స్విమ్మింగ్ నైపుణ్యాలు కలిగి ఉండడం, వారు తరచుగా లైఫ్ జాకెట్లు లేకుండానే కనిపిస్తారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
(4 / 6)
ఎగువ నుంచి వరద నీరు తగ్గడంతో సోమవారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టు తొమ్మిది గేట్లను మూసివేశారు. గేట్లు మూసివేయడంతో స్థానిక మత్స్యకారులు మంగళవారం ఉదయం ఒక్కసారిగా చేపల వేటకు బయలుదేరారు. చిన్న చిన్న పడవలలో నదిపై వేటకు వెళ్తు్న్న వీడియో తీసి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.
(5 / 6)
ఈ మత్స్యకారులు లింగాలగట్టు గ్రామానికి చెందిన వారుగా చెబుతున్నారు. అధికారుల హెచ్చరికలను లెక్కచేయకుండా నదిలో చేపల వేటకు వెళ్తారని అంటున్నారు. వరద నీటిలో భారీ పరిమాణంలో చేపలు కొట్టుకువస్తాయని, అవి రుచికరంగానూ ఉంటాయని స్థానిక మత్స్యకారులు అంటున్నారు.
ఇతర గ్యాలరీలు