తెలుగు న్యూస్ / ఫోటో /
Tirumala: అన్నమయ్య 520వ వర్ధంతి... తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు
- Tallapaka Annamacharya 520th Death Anniversary: తిరుమలలో అన్నమయ్య 520వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం స్థానిక నారాయణగిరి ఉద్యానవనంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అహోబిల 46వ పీఠాధిపతి శ్రీమాన్ శ్రీవణ్ శఠగోప రంగానాధ యతీంద్ర మహాదేసికన్ స్వామిజీ హాజరయ్యారు. ఈ వేడకులను మార్చి 21వ తేదీ వరకు నిర్వహించనుంది టీటీడీ.

(1 / 4)
మార్చి 18 నుంచి 21వ తేదీ వరకు తిరుపతి, తిరుమలలో అన్నమయ్య వర్ధంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా… తొలిరోజు సాయంత్రం 6 గంటలకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ప్రముఖ కళాకారులతో ”సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం” నిర్వహించారు.(twitter)
(2 / 4)
వేడుకలలో భాగంగా శ్రీవారికి ఉంజల్ సేవ నిర్వహించారు. వేడుకల్లో భాగంగా టీటీడీ ఆస్థాన విద్వాంసులు, అన్నమాచర్య ప్రాజెక్టు కళాకారులు పాల్గొన్నారు.(twitter)
(3 / 4)
మహతి ఆడిటోరియంలో మార్చి 18 నుంచి 21వ తేదీ వరకు సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో సుప్రసిద్ధ సంగీత, నృత్య కళాకారులు పాల్గొంటారు.(twitter)
(4 / 4)
మార్చి 19 నుండి 21వ తేదీ వరకు సాహితీ సదస్సులు ఉంటాయని టీటీడీ తెలిపింది, సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. మార్చి 21వ తేదీ వరకు తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు సంగీతం, హరికథ కార్యక్రమాలు ఉంటాయి.(twitter)
ఇతర గ్యాలరీలు