(1 / 6)
ఏపీలో పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 1వ తేదీతో అన్ని పూర్తి కాగా… మరోవైపు జవాబుపత్రాల మూల్యాంకనం చేసేలా అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టనున్నారు.
(2 / 6)
ఏప్రిల్ 9వ తేదీ వరకు మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇదే సమయంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఓపెన్ టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నారు.
(3 / 6)
ఏపీ టెన్త్ స్పాట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. విధుల్లో ఉండాల్సిన సిబ్బందిని కూడా ఖరారు చేశారు. అసిస్టెంట్ ఎగ్జామినర్స్ ఆయా రోజుల్లో రోజుకు 40 పేపర్ల చొప్పున మూల్యాంకనం చేయనున్నారు.
(4 / 6)
మూల్యాంకన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టనున్నారు. ఒక్కో జవాబు పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలిన చేసిన తర్వాతే… మార్కులను ఖరారు చేయనున్నారు. ఎలాంటి తప్పులు లేకుండా స్పాట్ జరగాలని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
(istockphoto.com)(5 / 6)
అసిస్టెంట్ ఎగ్జామినర్స్ ఆయా రోజుల్లో రోజుకు 40 పేపర్ల చొప్పున మూల్యాంకనం చేయనున్నారు. వీటిని స్పెషల్ అసిస్టెంట్లు మరోసారి పరిశీలిస్తారు. మూల్యాంకనం పూర్తైన వాటిలో 20 పేపర్లు చొప్పున చీఫ్ ఎగ్జామినర్ పరిశీలిస్తారు. అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ ప్రతి అసిస్టెంట్ ఎగ్జామినర్ కరెక్ట్ చేసిన ఆన్సర్ షీట్లలో కనీసం రెండు జవాబు పత్రాల చొప్పున పరిశీలించాల్సి ఉంటుంది. క్యాంప్ ఆఫీసర్ రోజుకు 20 ఆన్సర్ పత్రాలు, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ రోజుకు 45 ఆన్సర్ పత్రాల చొప్పున మూల్యాంకనం చేసిన పత్రాలు పునఃపరిశీలన చేస్తారు.
(istockphoto.com)
(6 / 6)
స్పాట్ పూర్తయిన తర్వాత సాంకేతికపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత విద్యాశాఖ నుంచి అనుమతి లభిస్తే… ఫలితాలను తేదీని ప్రకటిస్తారు. గతేడాది ఏప్రిల్ 22వ తేదీన టెన్త్ ఫలితాలు వచ్చాయి. ఈసారి కూడా ఏప్రిల్ నెల చివరి నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. గతేడాది మాదిరిగానే ఈసారి ఏపీ టెన్త్ ఫలితాలను HT తెలుగు వెబ్ సైట్ తో పాటు https://www.bse.ap.gov.in/, మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను చెక్ చేసుకునే వీలు ఉంటుంది.
(istockphoto.com)ఇతర గ్యాలరీలు