(1 / 7)
ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మార్చి 20వ తేదీతో ముగియనున్నాయి. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,535 కేంద్రాలను ఏర్పాటు చేయగా…
ఈ విద్యా సంవత్సరంలో 10 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
(2 / 7)
ఓవైపు పరీక్షలు జరుగుతుండగానే…. మరోవైపు ఏపీ ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. జవాబు పత్రాల మూల్యాంకనం కోసం షెడ్యూల్ ను ప్రకటించింది. ఇంటర్ బోర్డు వివరాల ప్రకారం… మార్చి 17వ తేదీ నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించింది.
(3 / 7)
మొత్తం 4 విడతల్లో ఏపీ ఇంటర్ స్పాట్ ను పూర్తి చేయనున్నారు. మార్చి 17 నుంచి ఫస్ట్ స్పెల్ ప్రారంభం కాగా… ముందుగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మాథ్స్, పౌరశాస్త్రం పేపర్లను మూల్యాంకనం చేస్తున్నారు.
(AFP)(4 / 7)
ఇక రెండో స్పెల్ మార్చి 22 నుంచి మొదలవుతుంది. ఇందులో ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్ల మూల్యాంకనం షురూ అవుతుంది. ఇక మూడో విడత స్పెల్ మార్చి 24 నుంచి ఉంటుంది. ఇందులో కెమిస్ట్రీ, హిస్టరీ పేపర్ల జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు.
(5 / 7)
ఇక మార్చి 26వ తేదీ నుంచి నాల్గో స్పెల్ ప్రారంభిస్తారు. ఇందులో బోటనీ, జువాలజీ, కామర్స్ తో పాటు బ్రిడ్జ్ కోర్సు పత్రాలను మూల్యాంకనం చేస్తారు.
(6 / 7)
ఇంటర్ స్పాట్ దృష్ట్యా తగినంత సిబ్బందిని అధికారులు ఏర్పాటు చేశారు. స్పెల్ కు అనుగుణంగా… విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. స్పాట్ కేంద్రాల్లో సెల్‌ఫోన్లను అనుమతి ఉండదని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.
ఇతర గ్యాలరీలు