CCC: లక్ష కెమెరాల భారీ స్క్రీన్… కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ప్రత్యేకతలెన్నో-specifications of integrated command and control centre of hyderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ccc: లక్ష కెమెరాల భారీ స్క్రీన్… కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ప్రత్యేకతలెన్నో

CCC: లక్ష కెమెరాల భారీ స్క్రీన్… కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ప్రత్యేకతలెన్నో

Published Aug 04, 2022 09:50 PM IST HT Telugu Desk
Published Aug 04, 2022 09:50 PM IST

  • Integrated Command and Control Centre: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభమైంది. సువిశాల విస్తీర్ణం.. ఐదు టవర్లు.. అత్యాధునికి టెక్నాలజీ పరిజ్ఞానం వినియోగం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో నిర్మితమైన పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సేవలు అందించనుంది. ఈ సెంటర్ ప్రత్యేకతలు చూస్తే…..

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆగస్టు 4వ తేదీన ప్రారంభించారు. ఈ సెంటర్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసింది. ఈ సెంటర్లో మొత్తం 6 లక్షల 42 వేల చదరపు అడుగుల నిర్మాణం జరిపారు.

(1 / 8)

(HT)

ఈ సెంటర్ ను మొత్తం ఐదు బ్లాక్‌లుగా నిర్మించారు. టవర్‌ ‘ఏ’లో గ్రౌండ్‌ఫ్లోర్‌తోపాటు 19 అంతస్తులు, టవర్‌ ‘బీ’లో రెండు బేస్‌మెంట్లు గ్రౌండ్‌ఫ్లోర్‌, 15 అంతస్తులు, టవర్‌ ‘సీ’లో ఆడిటోరియం గ్రౌండ్‌ఫ్లోర్‌, రెండు అంతస్తులు, టవర్‌ ‘డీ’లో గ్రౌండ్‌ ప్లస్‌ మొదటి అంతస్తు, టవర్‌ ‘ఈ’లో సీసీసీని 4 నుంచి 7 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. మరో రెండు బేస్‌మెంట్‌ లెవల్‌లు ఉన్నాయి. అన్ని టవర్లలో ‘ఏ’ టవర్‌ ఎత్తయినది. దీనిలో మొత్తం 20 అంతస్తులు ఉన్నాయి. దీనిలోనే నాల్గో అంతస్తులో డీజీపీ చాంబర్‌, 18వ అంతస్తులో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ చాంబర్‌ ఉంటాయి. 7వ అంతస్తులో ప్రముఖుల చాంబర్లు ఉన్నాయి.

(2 / 8)

ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాల ఫీడ్‌ చూసే సామర్థ్యంతో భారీ స్క్రీన్‌ కూడా ఉంది. అలాగే, తెలంగాణలోని అన్ని జిల్లాల సీసీటీవీల ఫీడ్‌, ఇతర సమాచారం కూడా హైదరాబాద్‌లోని సీసీసీకి అనుసంధానమవుతుంది. బహుముఖ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వరంగంలోని అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకొంటూ విపత్తుల సమయంలో ప్రజలను సకాలంలో కాపాడటం, నష్టాన్ని తగ్గించడం దీని లక్ష్యం.నిరంతర పర్యవేక్షణతో రాష్ట్రంలో నేరాలను నియంత్రించడం కోసం పనిచేస్తుంది.

(3 / 8)

టవర్‌ ఏ, బీలను 14వ అంతస్తులో కలుపుతూ 400 మెట్రిక్‌ టన్నుల బరువుతో దేశంలోనే అత్యంత బరువైన స్కైవాక్‌ వంతెన నిర్మించారు. దీనికి సోలార్‌ ఫొటోవోల్టిక్‌ ప్యానల్స్‌తో రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేశారు. నైరుతివైపు ఉన్న టవర్‌పైన హెలిపాడ్‌ను ఏర్పాటు చేశారు. వీవీఐపీ మూమెంట్స్‌ కోసం హెలికాప్టర్‌ సేవలను వాడుకోవచ్చు. టవర్లలోని కింది ఫ్లోర్లలో ఆడిటోరియం, కేఫ్‌, మల్టీపర్పస్‌ హాల్‌, మీడియా సెంటర్‌, రిసెప్షన్‌ లాబీ ఏర్పాటు చేశారు. టవర్‌ - ఏలో 550 వర్క్‌ స్టేషన్లు ఉంటాయి. వెయ్యి మంది సిబ్బంది పనిచేయవచ్చు. టవర్‌ బీలో 580 వర్క్‌ స్టేషన్లు ఉన్నాయి. 1500 మంది సిబ్బంది పనిచేయవచ్చు. అన్ని ఫ్లోర్లలోనూ కిచెన్ అందుబాటులో ఉంది. ఆడిటోరియంను 590 మంది సీటింగ్‌ కెపాసిటీతో ఏర్పాటు చేశారు.

(4 / 8)

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు, అన్ని అంబులెన్సులు, ఫైర్‌ స్టేషన్లు, పోలీస్‌ స్టేషన్లు, అన్ని ప్రధాన లొకేషన్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన కూడళ్లు, మార్కెట్లు... ఇలా ప్రతి సమాచారాన్ని సీసీసీలోని హైఎండ్‌ డాటా ఎనాలసిస్‌ సెంటర్‌కు అనుసంధానిస్తారు. రాష్ట్రంలో ఎక్కడైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, సీసీటీవీల్లోని ప్రత్యేక స్టాఫ్ట్‌ వేర్‌ ద్వారా కెమెరాయే నేరుగా సీసీసీకి అలర్ట్‌ పంపుతుంది. అక్కడ పాప్‌అప్‌ స్క్రీన్‌పై వస్తుంది. దీంతో వెంటనే సిబ్బంది అలర్ట్‌ అవుతారు.

(5 / 8)

మొత్తంగా 600 కు పైగా వాహనాల పార్కింగ్ సౌకర్యం కలదు. టవర్‌ - డీ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 125 మంది కూర్చునే సామర్థ్యంతో మీడియా బ్రీఫింగ్‌ హాల్‌ ఉంది. నేరుగా అక్కడి నుంచే లైవ్‌ కవరేజ్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక డాటా సెంటర్‌ కోసం బెల్జియం, జర్మనీ నుంచి సర్వర్లు తెప్పించారు. దాదాపు 30 పెటా బైట్ల సామర్థ్యం ఉన్న స్టోరేజీ ఉన్నది. అంటే 10 లక్షల సీసీటీవీ కెమెరాల ఫీడ్‌ ఇందులో నిక్షిప్తం అవుతుంది.

(6 / 8)

ఈ సెంటర్‌లో పోలీస్‌, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఆరోగ్యశాఖ, ప్రకృతివిపత్తుల నిర్వహణశాఖ సహా ముఖ్యమైన అన్ని ప్రభుత్వ విభాగాల కేంద్రాలు. ఏదైనా విపత్తు, ప్రమాదం జరిగినప్పుడు అన్ని శాఖల సమన్వయంతో సమస్యను పరిష్కరిస్తారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి కూడా ఎన్‌ఫోర్స్‌ మెంట్‌కు ఈ డాటాను వినియోగించుకోవచ్చు. రోజువారీ శాంతిభద్రతల నిర్వహణతోపాటు భారీ బహిరంగ సభలు, ఉత్సవాల సందర్భంగా బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ కూడా సాధ్యమవుతుంది.

(7 / 8)

సంబంధిత కథనం

ఇతర గ్యాలరీలు