AP Tourism : అద్భుతమైన అనుభవాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా.. ప్రకాశం జిల్లాలోని ఈ ప్రదేశాలకు వెళ్లండి!-special features of 5 popular tourist places in prakasam district ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tourism : అద్భుతమైన అనుభవాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా.. ప్రకాశం జిల్లాలోని ఈ ప్రదేశాలకు వెళ్లండి!

AP Tourism : అద్భుతమైన అనుభవాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా.. ప్రకాశం జిల్లాలోని ఈ ప్రదేశాలకు వెళ్లండి!

Jan 02, 2025, 08:04 PM IST Basani Shiva Kumar
Jan 02, 2025, 08:04 PM , IST

  • AP Tourism : ప్రకాశం జిల్లా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక అందమైన జిల్లా. ఇక్కడ చారిత్రక స్మారకాలు, సహజ సిద్ధమైన అందాలు, మతపరమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇవి అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి. ఏమాత్రం అవకాశం ఉన్నా.. ప్రకాశం జిల్లాలో ఈ ప్రదేశాలను మాత్రం అస్సలు నిస్సవ్వొద్దు.

 భైరవకోన అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది ఎత్తయిన జలపాతం. ఎత్తైన కొండలపై ఉన్న లింగాల దొరువు నుంచి ప్రవహించి.. 200 మీటర్ల ఎత్తు నుంచి పడుతూ యాత్రికులకు కనువిందు చేస్తోంది ఈ జలపాతం. అంతేకాకుండా.. 9వ శతాబ్దానికి చెందిన ఓ అద్భుత శివాలయం కూడా ఇక్కడ ఉంది.   

(1 / 5)

ప్రకాశం జిల్లా పేరు వినగానే గుర్తొచ్చేది త్రిపురాంతక ఆలయం. ఈ ఆలయాన్ని నిర్మించిన త్రిపురాసులు అనే రాక్షసులను.. లోక కల్యాణం కోసం శివుడు సంహరించాడు. ఈ ఆలయానికి మరో విశిష్టత ఉంది. ప్రపంచంలో శ్రీచక్రంపై నిర్మించిన ఆలయం ఇదొక్కటే. స్వామివారి ఆలయం కొండ మీద ఉంటే, అమ్మవారి కోవెల సమీపంలోని చెరువులో ఉంది.   

(2 / 5)

ప్రకాశం జిల్లాలో మరో ప్రత్యేక దేవాలయం ఉంది. అదే వలేటివారిపాలెం మాలకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ప్రతి శనివారం మాత్రమే భక్తులకు దైవదర్శనం ఉంటుంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం పుణ్యక్షేత్రంగానే కాక.. పర్యాటక కేంద్రంగానూ వర్ధిల్లుతోంది. ఇక్కడ లక్ష్మీఅమ్మవారి వద్దకు వెళ్లే కొండ పగిలి ఉంటుంది.   

(3 / 5)

ప్రకాశం జిల్లాలో మరో ప్రత్యేకత నల్లమల అడవులు. ప్రకాశం జిల్లాలోని ముఖ్యమైన కొండ శ్రేణులు, సుందరమైన నల్లమల అడవిలో  ఉన్నవెలిగొండ ప్రాజెక్టు.. ప్రకాశం జిల్లాను కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాల నుండి వేరు చేస్తుంది. నల్లమల అడవి సముద్ర మట్టానికి సగటున 620 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఉత్తర-దక్షిణ దిశలో 113 కిలోమీటర్ల పొడవు, 32 కిలోమీటర్ల వెడల్పుతో నల్లమల విస్తరిచి ఉంది.

(4 / 5)

తిప్పాయపాలెం రిజర్వాయర్ ప్రకాశం జిల్లాలో చాలా స్పెషల్. ఈ రిజర్వాయర్ ప్రకాశం జిల్లాలోని ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా ఉంది. కుటుంబం, స్నేహితులతో కలిసి పిక్నిక్‌కు వెళ్లడానికి ఇది మంచి ప్లేస్. ప్రకృతిని ఆస్వాదించడానికి అనువైన ప్రదేశం.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు