తెలుగు న్యూస్ / ఫోటో /
Southwest monsoon: రుతుపవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు; జనజీవనం అస్తవ్యస్తం
- నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని చేరుకుని సాధారణం కంటే రెండు రోజులు ముందుగానే ఈశాన్య భారతంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. కాగా, కేరళలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.

(1 / 5)
తిరువనంతపురంలో వరద ప్రభావిత ప్రాంతం నుంచి ఓ వృద్ధురాలిని కేరళ అగ్నిమాపక, రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది సురక్షితంగా తీసుకువెళ్తున్న దృశ్యం. భారీ వర్షాలతో తిరువనంతపురంలో జనజీవనానికి అంతరాయం కలిగించింది.
(PTI)(2 / 5)
కొచ్చితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలైన కలమస్సేరి, కక్కనాడ్ లలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
(PTI)(3 / 5)
కొచ్చిలో భారీ వర్షం కారణంగా రోడ్డుపైకి భారీగా చేరిన వర్షపు నీరు. ఆ నీటిలో ప్రయణిస్తున్న వాహనదారులు.
(PTI)(4 / 5)
కేరళలోని తిరువనంతపురంలో స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ (శాప్), కేరళ ఆర్మ్డ్ పోలీస్ (కేఏపీ) పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గార్డ్ ఆఫ్ హానర్ ను పొందారు.
(PTI)ఇతర గ్యాలరీలు