తెలుగు న్యూస్ / ఫోటో /
"క్షణాల్లో అంతా జరిగిపోయింది"- దక్షిణ కొరియా విమాన ప్రమాదం లైవ్ ఫొటోలు..
- దక్షిణ కొరియాలో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. ప్రమాదం సమయంలో 181 మంది విమానంలో ఉండగా, ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. విమానం చివరి క్షణాలు రికార్డు అయ్యాయి. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్గా మారాయి.

(1 / 5)
జెజు ఎయిర్ విమానం బ్యాంకాక్ నుంచి మువాన్ నగరానికి తిరిగివచ్చింది. నగరంలోని విమానాశ్రయంలో ఆదివారం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో విమానం పేలిపోయింది.
(2 / 5)
విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన సమయంలోనే ఒక పక్షి దాన్ని ఢీకొట్టిందని, సరైన సమయంలో ల్యాండింగ్ గేర్స్ ఓపెన్ అవ్వకపోవడంతో విమానం రన్వై మీద కూలిపోయి ఈడ్చుకుంటూ వెళ్లి చివరికి ఒక గోడను ఢీకొట్టిందని దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు.
(3 / 5)
దక్షిణ కొరియా ప్రమాదం సమయంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు ఫ్లైట్ అటెండెంట్లు ఉన్నారు. వీరిలో 179మంది ప్రాణాలు కోల్పోయారు.(BNO NEWS)
(4 / 5)
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు విస్తృతస్థాయి సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపుచేసి, విమానంలో నుంచి ఇద్దరిని బయటకు తీశారు. మిగిలిన వారు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు.(AP)
ఇతర గ్యాలరీలు