(1 / 6)
వేసవి కాలంలో అదనపు రద్దీని క్లియర్ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి, విశాఖపట్నం మధ్య రెండు ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతుంది.
(2 / 6)
చర్లపల్లి - విశాఖపట్నం (రైలు నం. 07441) ప్రత్యేక రైలు మే 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 03.35 విశాఖపట్నం చేరుకుంటుంది.
(3 / 6)
విశాఖపట్నం-చర్లపల్లి(రైలు నం.07442) ప్రత్యేక రైలు మే 18వ తేదీన రాత్రి 11.00 విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.40 చర్లపల్లి చేరుకుంటుంది.
(4 / 6)
ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, దువ్వాడ స్టేషన్లు ఇరువైపులా ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 3ఏసీ, 3ఏసీ(ఎకానమీ) క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
(5 / 6)
భారతీయ రైల్వే వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశలో 9 వందేభారత్ స్లీపర్ రైళ్లు ప్రవేశపెడుతుంది. ఇందులో రెండు రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయించనుంది. ఈ రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లు ఏపీ, తెలంగాణలో వరంగల్ మీదుగా ప్రయాణించనున్నాయి.
(6 / 6)
ఈ రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు మే నెలాఖరులో తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ఒకటి విజయవాడ నుంచి వారణాసి అయోధ్య వరకు, మరొకటి సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు నడపనున్నారు. ప్రతి స్లీపర్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి.
ఇతర గ్యాలరీలు