Sankranti Special Trains : సంక్రాంతి తిరుగు ప్రయాణాల రద్దీ-దక్షిణ మధ్య రైల్వే 8 ప్రత్యేక రైళ్లు
Sankranti Special Trains : సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లినవారి తిరుగు ప్రయాణాలకు మరో ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. జనవరి 18, 19, 20 తేదీల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.
(1 / 6)
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లినవారి తిరుగు ప్రయాణాలకు మరో ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జనవరి 18, 19, 20 తేదీల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.
(2 / 6)
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లినవారంతా తిరిగి పట్నంబాట పట్టారు. దీంతో రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా... దక్షిణ మధ్య రైల్వే 8 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది.
(3 / 6)
ఈ నెల 18, 19, 20 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. 18వ తేదీన కాకినాడ నుంచి ఒకటి, విశాఖపట్నం నుంచి రెండు రైళ్లు చర్లపల్లికి బయలుదేరతాయి. అలాగే 19న నరసాపురం, విశాఖపట్నం నుంచి రెండు రైళ్లు చర్లపల్లికి ప్రయాణిస్తాయి.
(4 / 6)
కాకినాడ టౌన్-చర్లపల్లి ప్రత్యేక రైలు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగామ రైల్వే స్టేషన్లలో ఆగనుంది. నర్సాపూర్-చర్లపల్లి ప్రత్యేక రైలు... పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట, జనగామ స్టేషన్లలో నిలపనున్నారు.
(5 / 6)
ఈ నెల 19న చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి ఒకటి, భువనేశ్వర్‌కు ఒకటి చొప్పున రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈ నెల 20న చర్లపల్లి నుంచి విశాఖకు మరో ప్రత్యేక రైలు నడపనున్నారు.
(6 / 6)
విశాఖ-చర్లపల్లి మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ రైల్వేస్టేషన్లలో ఆగనున్నాయి. చర్లపల్లి-భువనేశ్వర్ ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, బలుగాన్, ఖర్దా రోడ్ స్టేషన్లలో ఆగనుంది.
ఇతర గ్యాలరీలు