తెలుగు న్యూస్ / ఫోటో /
South Central Railway : ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్.. ఇకనుంచి తిప్పలు తప్పనున్నాయి!
- South Central Railway : ఎక్కువ దూరం వెళ్లేవారు రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. రిజర్వేషన్ చేసుకున్న వారు హ్యాపీగా జర్నీ చేస్తారు. కానీ.. సాధారణ ప్రయాణికులు చాలా అవస్థలు పడతారు. అందుకు కారణం జనరల్ బోగీలు తక్కువ ఉండటమే. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
- South Central Railway : ఎక్కువ దూరం వెళ్లేవారు రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. రిజర్వేషన్ చేసుకున్న వారు హ్యాపీగా జర్నీ చేస్తారు. కానీ.. సాధారణ ప్రయాణికులు చాలా అవస్థలు పడతారు. అందుకు కారణం జనరల్ బోగీలు తక్కువ ఉండటమే. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
(1 / 5)
సాధారణ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం రెండే జనరల్ కోచ్‌లకు అదనంగా మరో రెండు బోగీలను జత చేయనున్నట్టు వెల్లడించింది. దీంతో జనరల్ కోచ్‌ల సంఖ్య.. నాలుగుకు చేరనుంది. ఆధునిక పరిజ్ఞానం కలిగిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను యాడ్ చేయనున్నారు. (istockphoto)
(2 / 5)
సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని 21 జతల రైళ్లకు.. అదనంగా 80 ఎల్‌హెచ్‌బీ బోగీలు అందుబాటులోకి వస్తాయని.. అధికారులు వివరించారు. దీంతో రైళ్లలో పేదలు ప్రయాణించే జనరల్ బోగీల రూపం మారుతోంది. కొత్తగా వస్తున్న జనరల్ బోగీలను ఎల్‌హెచ్‌బీ పరిజ్ఞానంతో తయారుచేసినవి ప్రవేశపెడుతున్నారు. పాతతరం ఐసీఎఫ్ బోగీల్లో 90 సీట్లు ఉంటే.. ఎల్‌హెచ్‌బీ బోగీల్లో సీట్ల సంఖ్య 100. ఇందులో ఎక్కువ మంది ప్రయాణించవచ్చు. (istockphoto)
(3 / 5)
సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో 19 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు 66 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రవేశపెట్టారు. నారాయణాద్రి, గౌతమి, దక్షిణ్ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనంగా ఎల్‌హెచ్‌బీ జనరల్ కోచ్‌లు వచ్చాయి. (istockphoto)
(4 / 5)
దేశవ్యాప్తంగా 370 రైళ్లలో అదనంగా ఎల్‌హెచ్‌బీ బోగీలను దశలవారీగా జత చేస్తోందని.. సౌత్ సెంట్రల్ రైల్వే స్పష్టం చేసింది. దీంతో రోజుకూ అదనంగా 70 వేల మంది ప్రయాణికులు జనరల్ బోగీల్లో ప్రయాణించవచ్చు. (istockphoto)
ఇతర గ్యాలరీలు