South Africa World Cup Semi Finals: అయ్యో దక్షిణాఫ్రికా.. సెమీస్‍లో ఐదోసారి నిరాశ-south africa lost five cricket odi world cup semi finals check details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  South Africa Lost Five Cricket Odi World Cup Semi Finals Check Details

South Africa World Cup Semi Finals: అయ్యో దక్షిణాఫ్రికా.. సెమీస్‍లో ఐదోసారి నిరాశ

Nov 16, 2023, 11:59 PM IST Chatakonda Krishna Prakash
Nov 16, 2023, 11:59 PM , IST

South Africa World Cup: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలోనూ దక్షిణాఫ్రికాకు నిరాశ ఎదురైంది. నేడు (నవంబర్ 16) సెమీఫైనల్‍లో ఆస్ట్రేలియా చేతిలో ఆ జట్టు ఓడింది. దీంతో వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఐదోసారి సెమీస్‍లో దక్షిణాఫ్రికాకు నిరాశ ఎదురైంది. సఫారీ జట్టు సెమీస్ పరాజయాలు ఇవే. 

వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో నేడు (నవంబర్ 16) జరిగిన రెండో సెమీఫైనల్‍లో ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేదు. ఐదుసార్లు సెమీస్‍ ఫైనళ్లలో ఓడింది. ఆ వివరాలివే.. 

(1 / 6)

వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో నేడు (నవంబర్ 16) జరిగిన రెండో సెమీఫైనల్‍లో ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేదు. ఐదుసార్లు సెమీస్‍ ఫైనళ్లలో ఓడింది. ఆ వివరాలివే.. (AFP)

1992 వన్డే ప్రపంచకప్‍ సెమీఫైనల్‍లో ఇంగ్లండ్ చేతిలో 19 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‍కు వర్షం ఆటంకం కలిగించగా.. దురదృష్టకర రీతిలో సఫారీ జట్టుకు పరాజయం ఎదురైంది. 

(2 / 6)

1992 వన్డే ప్రపంచకప్‍ సెమీఫైనల్‍లో ఇంగ్లండ్ చేతిలో 19 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‍కు వర్షం ఆటంకం కలిగించగా.. దురదృష్టకర రీతిలో సఫారీ జట్టుకు పరాజయం ఎదురైంది. (Twitter)

1999 ప్రపంచకప్ సెమీస్‍లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఉత్కంఠ పోరు టైగా ముగిసింది. ఇరు జట్లు 213 రన్స్ చేశాయి. అయితే, ఫలితం కోసం సూపర్-6 నెట్‍రన్ రేట్‍ను పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో దక్షిణాఫ్రికాకు సెమీస్‍లో నిరాశ ఎదురైంది. ఆసీస్ కంటే నెట్‍రన్ తక్కువగా ఉండటంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. 

(3 / 6)

1999 ప్రపంచకప్ సెమీస్‍లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఉత్కంఠ పోరు టైగా ముగిసింది. ఇరు జట్లు 213 రన్స్ చేశాయి. అయితే, ఫలితం కోసం సూపర్-6 నెట్‍రన్ రేట్‍ను పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో దక్షిణాఫ్రికాకు సెమీస్‍లో నిరాశ ఎదురైంది. ఆసీస్ కంటే నెట్‍రన్ తక్కువగా ఉండటంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. (Twitter)

2007 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‍లో ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలోనే దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. 

(4 / 6)

2007 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‍లో ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలోనే దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. (AFP)

2015 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్‍లో న్యూజిలాండ్ చేతిలో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‍లో ఒక్క బంతి మిగిలి ఉండగా గెలిచింది న్యూజిలాండ్. 

(5 / 6)

2015 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్‍లో న్యూజిలాండ్ చేతిలో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‍లో ఒక్క బంతి మిగిలి ఉండగా గెలిచింది న్యూజిలాండ్. (HT Photo)

ఇక, ఇప్పటి 2023 వన్డే ప్రపంచకప్‍ సెమీఫైనల్‍లో ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి ఓటమి పాలైంది. దీంతో ప్రపంచకప్ చరిత్రలో సెమీస్ చేరిన ఐదుసార్లు సఫారీ జట్టు ఓడినట్టయింది. మరోసారి బాధతో విశ్వటోర్నీ నుంచి నిష్క్రమించింది. 

(6 / 6)

ఇక, ఇప్పటి 2023 వన్డే ప్రపంచకప్‍ సెమీఫైనల్‍లో ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి ఓటమి పాలైంది. దీంతో ప్రపంచకప్ చరిత్రలో సెమీస్ చేరిన ఐదుసార్లు సఫారీ జట్టు ఓడినట్టయింది. మరోసారి బాధతో విశ్వటోర్నీ నుంచి నిష్క్రమించింది. (AP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు