Sonam Kapoor: బ్లేజర్‌లో స్టైలిష్‍గా స్టన్నింగ్ లుక్‍తో సోనమ్: ఫొటోలు.. ఈ డ్రెస్ ధర ఎంతంటే!
Sonam Kapoor: బాలీవుడ్ నటి సోనమ్ కపూర్.. ఎలిగెంట్ లుక్‍తో ఆకట్టుకున్నారు. బ్లేజర్, ప్యాంట్ ధరించి స్టైలిష్‍గా కనిపించారు. ఆ ఫొటోలు ఇవే.
(1 / 6)
ఫ్యాషన్ విషయంలో బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఎప్పటికప్పుడు అదరగొడుతుంటారు. విభిన్నమైన ఔట్‍ఫిట్‍లతో మెరుస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా బ్లేజర్ ధరించి ఎలిగెంట్ లుక్‍లో మెరిశారు.
(Instagram/@sonamkapoor)(2 / 6)
బ్లేజర్, ప్యాంట్ ధరించి కెమెరాలకు స్టన్నింగ్ పోజులు ఇచ్చారు సోనమ్. స్టైలిష్ లుక్‍తో తళుక్కుమన్నారు. ఈ ఫొటోలను నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. బాస్ లుక్‍లో అదరగొట్టారు.
(Instagram/@sonamkapoor)(3 / 6)
చెక్డ్ ప్యాటర్న్, లాంగ్ స్లీవ్స్, లగ్జరీ లైనిన్ ఫ్యాబ్రిక్‍తో సోనమ్ ధరించిన బ్లేజర్ అదిరిపోయింది. దీనికి మ్యాచ్ అయ్యేలా రిలాక్స్డ్ బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించారు ఈ బ్యూటీ.
(Instagram/@sonamkapoor)(4 / 6)
సోనమ్ కపూర్ ధరించిన ఈ ఔట్‍ఫిట్ ధర ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా? రాల్ఫ్ లారెన్ బ్రాండ్‍కు చెందినది ఈ డ్రెస్. ఈ బ్లేజర్ ధర రూ.40వేలుగా ఉంది. అలాగే ఈ ప్యాంట్ రేటు రూ.37,500గా ఉంది. మొత్తంగా ఈ ఔట్ ఫిట్ ధర రూ.77,500.
(Instagram/@sonamkapoor)(5 / 6)
2007లో సావరియా చిత్రంతో సోనమ్ కపూర్ బాలీవుడ్‍లో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఢిల్లీ-6 సినిమాతో చాలా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత వరుసగా చాలా సినిమాలు చేశారు.
(Instagram/@sonamkapoor)ఇతర గ్యాలరీలు