(1 / 6)
పచ్చి బఠానీలతో రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచవచ్చు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ), అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటే బఠానీలు ఉపయోగకరమైనవి ఉంటాయి.
(2 / 6)
పచ్చి బఠానీలు జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మలబద్ధకం లాంటి సమస్య నుంచి బయపడేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
(3 / 6)
ఈ బఠానీలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎండు బఠానీలకంటే పచ్చి బఠానీలతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కావాలంటే కొద్ది మెుత్తంలో రోజూ వీటిని తినవచ్చు.
(4 / 6)
క్యాన్సర్ను నివారించడంలో పచ్చి బఠానీలు సాయపడతాయని చెబుతారు. క్యాన్సర్ కణాల విషయంలో ఇవి సాయపడతాయి.
(5 / 6)
పచ్చి బఠానీల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. పిల్లలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వారికి క్రమం తప్పకుండా వీటిని ఇవ్వొచ్చు.
(6 / 6)
ఈ బఠానీల్లో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెంచేందుకు ఇవి సాయపడతాయి.
ఇతర గ్యాలరీలు