(1 / 5)
భారత వుమెన్స్ టీమ్ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన హిస్టరీ క్రియేట్ చేసింది. ఇంతవరకెప్పుడూ మరే భారత మహిళా క్రికెటర్ కు సాధ్యం కాని దాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ తో తొలి టీ20లో అద్భుతమైన శతకం బాదేసింది.
(Action Images via Reuters)(2 / 5)
శనివారం (జూన్ 28) ఇంగ్లాండ్ తో తొలి టీ20లో స్మృతి మంధాన సెంచరీ బాదేసింది. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన ఆమె 62 బంతుల్లో 112 పరుగులు చేసింది. 15 ఫోర్లు, 3 సిక్సర్లు బాదింది.
(Action Images via Reuters)(3 / 5)
ఇంగ్లాండ్ పై టీ20 సెంచరీతో స్మృతి మంధాన అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది. టెస్టు, వన్డే, టీ20ల్లో అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఫస్ట్ ఇండియన్ వుమెన్ క్రికెటర్ గా స్మృతి హిస్టరీ క్రియేట్ చేసింది.
(AP)(4 / 5)
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో స్మృతి మంధానకు ఇదే ఫస్ట్ సెంచరీ. పైగా ఈ మ్యాచ్ కు ఆమెనే కెప్టెన్. ఇంగ్లాండ్ గడ్డపై ప్రత్యర్థి బౌలర్లపై మంధాన అద్భుతమైన ఆధిపత్యం ప్రదర్శించింది.
(Action Images via Reuters)(5 / 5)
స్మృతి మంధాన సెంచరీతో ఇంగ్లాండ్ పై ఇండియా 5 వికెట్లకు 210 పరుగులు చేసింది. టీ20ల్లో ఇంగ్లాండ్ పై ఇండియాకు ఇదే హైయ్యస్ట్ స్కోరు. ఓవరాల్ గా భారత్ కు రెండో అత్యధిక టీమ్ స్కోరు.
(Action Images via Reuters)ఇతర గ్యాలరీలు